ఆ హీరోతో నటించేటప్పుడు కొంచెం టెన్షన్‌ !

‘షారూఖ్‌ ఖాన్‌తో నటించేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. సల్మాన్‌తో షూటింగ్‌ చాలా సరదాగా సాగిపోతుంది’ అని తెలిపింది కత్రినా కైఫ్‌. ఈ ఏడాది వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో కత్రినా బిజీగా గడిపింది. ఇప్పటికే అమీర్‌ ఖాన్‌తో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’లో ఆమె నటించి మెప్పించింది. ‘వెల్‌ కమ్‌ టు న్యూయార్క్‌’, ‘సూయి ధాగా’లో ప్రత్యేక పాత్రల్లో మెరిసింది. ప్రస్తుతం షారూఖ్‌తో ‘జీరో’ చిత్రంలో నటించింది.ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ
 
‘పలు భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించే అవకాశం రావడం లక్కీగా, ఆనందంగా భావిస్తున్నాను. ‘హస్న్‌ పర్చమ్‌..’ సాంగ్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఏడాది మొత్తంలో అది హైలైట్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఈ పాట నా పాత్ర ప్రవృత్తిని తెలియజేస్తుంది. ఈచిత్రంలో షారూఖ్‌తో కలిసి నటించాను. పలు సినిమాల్లో సల్మాన్‌తోనూ నటించాను. వీరిద్దరూ సూపర్‌ ఆర్టిస్టులు. అయితే షారూఖ్‌తో నటించడాన్ని కొంత ఒత్తిడిగా ఫీలవుతా. అదే సల్మాన్‌తో అయితే చాలా సరదాగా ఉంటుంది. వీరిద్దరితో యాక్ట్‌ చేస్తున్నప్పుడు నాలో నేను గమనించిన తేడా ఇదే. అయితే అలా జరగటానికి కారణం మాత్రం తెలీదు’ అని తెలిపింది. ఇందులో కత్రినా మద్యానికి బానిసైన స్టార్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనంద్‌.ఎల్‌.రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క శర్మ మరో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. దీంతోపాటు కత్రినా సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘భారత్‌’లోనూ నటిస్తోంది.
 
కత్రినాకు మరోసారి లిప్‌కిస్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ రొమాంటిక్ హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే స్టార్‌హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన షారుఖ్ చాలా సంవత్సరాల పాటు తెరపై ఏ హీరోయిన్‌కు కూడా లిప్‌కిస్ పెట్టలేదట. అయితే చివరికి ఓ సినిమాలో ఈ స్టార్ హీరో లిప్‌కిస్ పెట్టక తప్పలేదట. యశ్‌చోప్రా వంటి సీనియర్ దర్శకుడు అతనితో లిప్‌కిస్ పెట్టించారు. ‘జబ్ తక్ హై జాన్’ సినిమాలో షారుఖ్ హీరోయిన్ కత్రినాకైఫ్‌కు లిప్‌కిస్ పెట్టారు. ఇప్పుడు వీరిద్దరు మరోసారి కలిసి నటించారు. విడుదలకు సిద్ధమైన ‘జీరో’ సినిమాలో షారుఖ్, కత్రినా హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో కూడా వీరి మధ్య లిప్‌కిస్ సీన్ ఉందట. “తెరపై తొలిసారి షారుఖ్‌ను లిప్‌కిస్ పెట్టుకున్న హీరోయిన్ నువ్వే కదా… దీనికి లక్కీగా ఫీల్ అవుతున్నావా?” అని కత్రినాను ప్రశ్నించింది మీడియా. దీనికి ఆ భామ గడుసుగానే సమాధానం ఇచ్చింది… “షారుఖ్‌ను తొలిసారి తెరపై లిప్‌కిస్ పెట్టినందుకు తాను అదృష్టవంతురాలిని అనుకోవడం లేదని… తనను అలా ముద్దు పెట్టుకున్నందుకు షారుఖ్ ఖానే లక్కీ ఫెలో” అని తమాషాగా చెప్పింది కత్రినా.