ఆమెతో చెయ్యనంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది !

 కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనే అందంతోనే కాకుండా తమ అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితేఈ  బాలీవుడ్‌ హీరోయిన్లు కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. ఇతర నాయికలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గురించి కత్రినాను అడిగితే…. అలియా భట్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని, తమ కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ తయారు చేయాల్సిందిగా ఆదిత్య చోప్రాకి చెప్పానన్నారు. అయితే ఆ సినిమాలో తామిద్దరికీ శక్తిమంతమైన పాత్రలు ఉండాలని, భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలని కోరానని తెలిపారు. అలియా, నేను కలిసి నటిస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ కత్రినా విశ్వాసం వ్యక్తం చేశారు.

మరి దీపికాతో కలిసి మీరు నటిస్తారా? ….. అన్న ప్రశ్నకు ఆమె ‘నో ’ అంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే రణ్‌బీర్‌ కపూర్‌తో గతంలో కత్రినా, దీపికాలకు ఉన్న రిలేషన్‌ కారణంగానే కత్రినా ఈవిధంగా స్పందించారని  బీ- టౌన్‌లో టాక్‌ విన్పిస్తోంది. మరి ‘బ్రహ్మాస్త్ర’  సినిమాలో నటించినప్పటి నుంచి అలియా భట్‌ కూడా రణ్‌బీర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం కత్రినా దృష్టికి రాలేదేమోనని సెటైర్లు వేస్తున్నారు. అయితే గతంలో అలియా కూడా కత్రినా, దీపికాలతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.

లైఫ్‌ జర్నీతో బుక్‌….

కత్రినా తన లైఫ్‌ జర్నీని ఒక పుస్తక రూపంలో (ఆటోబయోగ్రఫీ) రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఈ ఆటోబయోగ్రఫీ కోసం ఆల్రెడీ ఒక పబ్లిషింగ్‌ హౌస్‌తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారమ్‌. ఈ బుక్‌లో ముఖ్యంగా తన బాల్యాన్ని, లండన్, జపాన్, ఇండియా ఇలా వివిధ దేశాల్లో ఉండటం వల్ల తన లైఫ్‌లో సంస్కృతులు చూపిన ప్రభావం, బాలీవుడ్‌లో 15 ఏళ్ల కెరీర్‌ను ఎక్కువగా ప్రస్తావించనున్నారట. ఈ బుక్‌ స్పూర్తిదాయకంగా ఉండబోతోందట.