కేవలం చేసే పనిమీద శ్రద్ద పెట్టమన్నాడు !

తాజాగా కూడా కత్రినా కైఫ్‌ సల్మాన్‌ తో తన బంధాన్ని గుర్తుచేసు కుంది .   గతంలో ప్రేమ వ్యవహారం నడిపిన వారిద్దరు ప్రస్తుతం విడిపోయి చెరో దిక్కున ఉంటున్నారు. అయినా ఎప్పుడూ వారి సంబంధం గురించి ప్రశ్నించినా… దానిపై గొప్ప గౌరవాన్ని చూపిస్తుంటారు.ఆమె నటించిన ‘జగ్గా జాసుస్‌’ అనే చిత్రం త్వరలో రానున్న నేపథ్యంలో ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మరోసారి సల్మాన్‌ గురించి తన అభిప్రాయాలు పంచుకుంది….

‘సల్మాన్‌ గొప్ప దయార్ధుడని, అందరినీ ప్రేమిస్తాడని, సహాయం చేస్తాడని మనందరికీ తెలుసు. కానీ, నాకు మాత్రం గొప్ప బలం. అతడు ఎప్పుడు నాకోసం కొత్తగా ఏమీ చేయాలనుకోలేదు. నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే చూశాడు. బాగా ప్రోత్సహించేవాడు. ప్రతి క్షణం నా వెన్నుతట్టి వెనుకాలే ఉన్నాడు. నా కాళ్ల మీద నేను నిలబడేందుకు.. కష్టపడి పనిచేసేందుకు అండగా నిలిచాడు’  అంటూ చెప్పింది.

 ‘ఒక రోజు నేను సల్మాన్‌ని కలిసి ఏడుస్తుంటే … అతడు మాత్రం నవ్వుతున్నాడు. ‘ఎంత నీచమైనవాడో’ అనుకున్నాను. నా తొలి చిత్రంతోనే నా కెరీర్‌ ముగిసిపోయిందని , ఇక నా జీవితం మొత్తం అయిపో​యిందని చెబుతున్నా… అతడు మాత్రం అలాగే నవ్వుతున్నాడు. చివరకు నవ్వు ఆపేసి.. ‘ఇదేం పెద్ద విషయం కాదన్నాడు. నేను ఎక్కడి వరకు వెళతానో తనకు కనిపిస్తోందని’ అన్నాడు. ‘నా జీవితంలో ఏవేం జరుగుతాయని ఆశించి వచ్చానో అవన్నీ జరుగుతాయని, కేవలం చేసే పనిమీద శ్రద్ద పెట్టమని’ చెప్పాడు. అదే చేశాను.. నిజంగా అదే జరిగింది’  అని కత్రినా చెప్పింది. వీరిద్దరూ ‘ఎక్ థా టైగర్’ లో కలిసి నటిస్తున్నారు .