ప్రస్తుతం నేనొక అద్భుతమైన స్థానంలో ఉన్నా!

“నటిగా సినిమాల్లో నటించడమనేది నాకెంతో సంతృప్తినిస్తుంది. సినిమాల వల్ల ఎన్నో ప్రాంతాలకు వెళ్లడంతో నేను పొందిన మానసిక ప్రశాంతతను ఎప్పటికీ మర్చిపోలేను.ప్రస్తుతం నేనొక అద్భుతమైన స్థానంలో ఉన్నాను”….అని అంటోంది కత్రినా కైఫ్‌. “నేను ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తాను. దేన్నీ సీరియస్‌గా తీసుకోను. ప్రస్తుతం కెరీర్‌ పరంగా నా స్థానం గురించి చాలా సంతృప్తిగా ఉన్నాను” అని అంటోంది. బాలీవుడ్‌లో గ్లామరస్‌ పాత్రలకే కాదు, యాక్షన్‌ ప్రధాన పాత్రలకూ కత్రినా కేరాఫ్‌గా నిలవడం విశేషం. అందం, దానికి మించిన అభినయంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఆమె 2003వ సంవత్సరంలో ‘బూమ్’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. సల్మాన్‌ఖాన్ చిత్రం ‘మైనే ప్యార్ క్యూ కియా’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి సక్సెస్‌ను అందుకోవడంతో.. ఆ తర్వాత ఇక వెనక్కి చూసుకోకుండా బాలీవుడ్‌లో దూసుకుపోయింది. తెలుగులో ‘మల్లీశ్వరి’ లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక బాలీవుడ్‌లో దాదాపు టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన కత్రినా గత ఏడాది సల్మాన్ ‘భారత్’, షారుఖ్ ‘జీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
తన సినిమా జర్నీ గురించి కత్రినా తన అభిమానులతో పంచుకుంటూ…
“ప్రస్తుతం నేనొక అద్భుతమైన స్థానంలో ఉన్నాను. నటిగా సినిమాల్లో నటించడమనేది నాకెంతో సంతృప్తినిస్తుంది. సినిమాల వల్ల ఎన్నో ప్రాంతాలకు వెళ్లడంతో నేను పొందిన మానసిక ప్రశాంతతను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు దక్కిన ప్రతి పాత్రను ప్రేమించి చేసేందుకు నేను ప్రయత్నించాను.నటించే ప్రాసెస్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. దాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ హ్యాపీనెస్‌ మనసుకి సంబంధించినది. నేను ప్రతి సినిమాకి కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఓ ఫార్ములాకి ఫిక్స్‌ కావాలనుకోవడం లేదు. ప్రస్తుతం పలు విభిన్నమైన కథా చిత్రాలు చేస్తున్నా” అని తెలిపింది. కత్రినా ప్రస్తుతం ‘సూర్యవంశీ’లో నటిస్తోంది. అక్షయ్ కుమార్‌ హీరోగా, రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సమ్మర్‌ స్పెషల్‌గా మార్చిలో విడుదల కానుంది.
 
డేటింగ్ విషయాలన్నీ చాలా సీక్రెట్
కత్రినా గురించి ఎదో ఒక న్యూస్ వైరల్ అవ్వడం మామూలే. ఆమె డేటింగ్ కి సంబందించిన న్యూస్ ఎదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య ముంబై మీడియాలో ఆ డోస్ కాస్త పెరిగిందనే చెప్పాలి.సల్మాన్ ఖాన్ నుంచి రణ్ బీర్ కపూర్ వరకు అమ్మడు ఓపెన్ గానే డేటింగ్ చేసింది. ముఖ్యంగా రణ్ బీర్ తో డేటింగ్ లో ఉన్నట్లు మీడియా కు సమాధానం కూడా ఇచ్చింది. అయితే కత్రినా ప్రస్తుతం డేటింగ్ విషయాలన్నీ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నట్లు టాక్. ఆమె ఇ ప్పుడు తనచుట్టూ ఓ కొత్త బాయ్ ఫ్రెండ్ ని తిప్పుకుంటున్నట్లు ఇటీవల రూమర్స్ పెరిగాయి. అతనెవరో కాదు… ‘యూరి’ హీరో విక్కీ కౌశల్. గత కొన్నాళ్లుగా కత్రినా చుట్టూ తిరుగుతుండడంతో ఆమెతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి .అయితే ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినప్పటికీ డోస్ తగ్గలేదు. ఈ మధ్య ఓ రెస్టారెంట్ కి వెళ్లిన ఆ ఇద్దరు అక్కడ ఒక వ్యక్తితో ఫోటో దిగారు. చాలా రోజుల తరువాత కత్రినా విక్కీ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మరోసారి గాసిప్స్ వెల్లువెత్తుతున్నాయి.