నేనూ సినిమాలు నిర్మించాలనుకుంటున్నా!

అగ్ర నటీమణులు ఓ వైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే తమ అభిరుచి మేరకు విభిన్న కథా చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలుగా మారారు. బాలీవుడ్‌లోప్రియాంక చోప్రా, అనుష్క శర్మ నిర్మాతలుగా మారి స్థానిక భాష చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. నూతన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వీరి బాటలోనే తాజాగా మరో బాలీవుడ్‌ కథానాయిక కత్రీనా కైఫ్‌ కూడా నిర్మాతగా మారబోతున్నారట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కత్రీనా నిర్మాణంపై తన ఆసక్తి వెల్లడించింది….
‘అనుష్క శర్మ తన క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఓ కొత్త తరహా సినిమాలను, మహిళా ప్రాధాన్యత
కలిగిన ‘ఎన్‌హెచ్‌ 10’, ‘ఫిల్హౌరి’, ‘పరి’ చిత్రాలను నిర్మిస్తున్నారు. అలానే నేను కూడా ఒక లాజిస్టిక్‌ యాంగిల్‌లో సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. కాకపోతే ఈ ఐడియా ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దానికి సహాయకులు కావాలి. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వస్తుంది’ అని తెలిపింది. కత్రీనా ప్రస్తుతం ‘టైగర్‌ జిందా హై’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’తోపాటు ఆనంద్‌ ఎల్‌.రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో షారూఖ్‌ ఖాన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది.