ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.ఓ’. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో `నింగిపై…` అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ కార్య్రకమంలో ఇంకా కల్యాణి మాలిక్, చిత్ర దర్శకుడు రాజ్ మాదిరాజు, సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు, నరేశ్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
కీరవాణి మాట్లాడుతూ – “సాంగ్ విన్నాను. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాకు సంగీతం అందించిన అరుణ్ చిలువేరు అద్భుతమైన మెలోడి మ్యూజిక్‌ను అందించగలరు. తను గిటారిస్ట్‌గా పనిచేస్తున్నప్పట్నుంచి నాకు తెలుసు. ట్యూన్ చాలా బావుంది. `ఆశగా ఆశకే ఆయువు పెంచగా..` వంటి సాహిత్యం ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. నరేశ్ అయ్యర్ పాటను చాలా చక్కగా పాడాడు. సినిమాలోని మిగిలిన రెండు పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్“ అన్నారు.
కల్యాణి మాలిక్ మాట్లాడుతూ – “`ఐతే`సినిమాకు నేనే మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటే.. దాన్ని అన్నయ్య కీరవాణిగారు పాడారు. ఇప్పుడు అన్యయ్యతో కలిసి `ఐతే 2.0` సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. అరుణ్ నా మ్యూజిక్ టీంలో గిటారిస్ట్‌గా పనిచేశారు. తనతో పనిచేయడం కూల్‌గా ఉంటుంది. `ఐతే` సినిమాలాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ సాధించాలి“ అన్నారు.
నరేశ్ అయ్యర్ మాట్లాడుతూ “మనం క్యాజువల్‌గా పాడుకునేలా ఈ పాట ఉంటుంది. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. సాంగ్స్, సినిమా అందరినీ మెప్పిస్తాయి“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్చిలువేరు మాట్లాడుతూ – “కీరవాణిగారి చేతుల మీదుగా పాట విడుదల కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన రాజ్ మాదిరాజుగారికి థాంక్స్. `నింగిపై..` అనే సాహిత్యంతో కూడిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడటం సంతోషంగా ఉంది. కిట్టు మంచి సాహిత్యాన్ని అందించారు“ అన్నారు.
డైరెక్టర్ రాజ్ మాదిరాజు మాట్లాడుతూ – “మా `ఐతే 2.0`లో మూడు సాంగ్స ఉన్నాయి. ఇందులో ముగ్గురు హీరోలకు సంబంధించిన వివిధ నేపథ్యాల్లో ఈ మూడు సాంగ్స్ వస్తాయి. ఆకలి, ఆశ, కోపం అనే మూడు అంశాలపై ఈ మూడు సాంగ్స్ ఉంటాయి. అరుణ్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద అరుణ్ పనిచేశాడు. తనని `ఐతే 2.0` సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు గిటార్ అంటే చాలా అభిమానం. అందులో అరుణ్ మాస్టర్. `నింగిపై…` అనే సాఫ్ట్ రాక్ నెంబర్‌కు కిట్టు విస్సా ప్రగడ చక్కటి సాహిత్యాన్ని అందించారు. తను నాకు `రిషి` సినిమా నుండి పరిచయం. తను మిగిలిన రెండు పాటలు రాయడమే కాకుండా.. సంభాషణల్లో సైతం సహకారం అందించారు. కరొకే ట్రాక్, స్మైల్ యాప్‌లో కూడా సాంగ్స్ అందుబాటులో ఉంటాయి“ అన్నారు.
నిర్మాత విజయ్ రామరాజు మాట్లాడుతూ – “మార్చి 16న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.
Keeravani releases ‘Aithe 2.0’ song, ‘Ningi Pai’
The song ‘Ningi Pai’ from ‘Aithe 2.0’ was recently released on the hands of MM Keeravani. Music director Kalyani Malik also graced the occasion. The film’s director, Raj Madiraju, and his team, expressed their happiness.
Keeravani said, “I have listened to the song and it’s quite new. Arun Chiluveru is a contemporary talent. He is very good at melodious music. I have known him as an excellent guitarist. I am sure he will go big. The lyrics are also quite inspiring. I liked lines such as ‘Ashaga aashake aayuve penchaga’. The singer (Naresh Iyer) has also done great. I wish the entire team all the best. I hope the other two songs are also equally inspiring.”
Producer Vijay Ramaraju said, “Our film will hit the screens on March 16.”
Song Launch Photos Download Link – https://drive.google.com/drive
https://wetransfer.com/downloa