ఇందులో వందరకాల కాస్ట్యూమ్స్ లో కనిపిస్తా !

ప్రముఖుల జీవితాన్ని అర్థం చేసుకుని వారిలా నటించడం చాలా కష్టమే. ‘మహానటి’ సినిమాలో సావిత్రిగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇదే మాట చెబుతోంది.ప్రముఖుల జీవితాలు అందరికీ ఆదర్శం.  అందుకే – అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ప్రముఖుల జీవితాలపై బయోపిక్ లు చాలానే తీస్తున్నారు.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మహానటి’ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే చిత్రంలో సావిత్రిగారిలా నటించడం నిజంగా సాహసమేననే విషయం అర్థమైందని చెప్పింది కీర్తి. 10 సెకన్లలో 100 రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగల ప్రతిభావంతురాలు సావిత్రి గారు. ఆమెలా హావభావాలను ప్రదర్శించడం ఒక సవాలుగానే అనిపించిందని చెప్పింది. వయసును బట్టి సావిత్రి మారుతూ వచ్చింది . తాను అలాగే కనిపించవలసి వస్తుంది అన్నది కీర్తి సురేష్.

సావిత్రి కేరక్టర్ వేసి ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయం కాదు అని కీర్తి సురేశ్ అంది. ఈ సినిమాలో దాదాపు 100 రకాల కాస్ట్యూమ్స్ లో కనిపిస్తానని కీర్తి చెప్పింది. ఇన్ని కాస్ట్యూమ్స్ లో కనిపించడం ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి అవుతుందని కూడా తెలిపింది కీర్తి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం రూపొందుతోంది