చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పేసిందట !

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందాలంటే ఫిట్‌నెస్‌పై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్లు కొంచెం బరువెక్కినా అభిమానులు అస్సలు ఒప్పుకోరు. లావెక్కిన హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూనే ఉంటాయి. దీంతో ఆఫర్లకు కూడా గండిపడుతుంది. అందుకే ఏ హీరోయిన్ అయినా సినిమాల కోసమైనా సరే లావు అవ్వడానికి ఒప్పుకోదు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్‌లు అయితే ఎంత మాత్రం ఒప్పుకోరు. ఇటీవల క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను లావు అవ్వాలని ఓ దర్శకుడు కోరాడట. కానీ ఈ అమ్మడు మాత్రం అందుకు నో చెప్పిందట. ఆ దర్శకుడు ఎవరో కాదు… సావిత్రి బయోపిక్ ‘మహానటి’ని డైరెక్ట్ చేస్తున్న నాగ్ అశ్విన్.

ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే సావిత్రి పెళ్లి తర్వాత కెరీర్ డీలా పడినప్పుడు కాస్త లావు అవుతుంది. అలాంటి ఎపిసోడ్ సీన్స్ కోసమని దర్శకుడు నాగ్ అశ్విన్… కీర్తిని లావు కావాలని కోరగా అందుకు ఆమె ఒప్పుకోలేదట. ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటున్న దశలో లావయితే అవకాశాలు రావని కీర్తి సురేష్ నిర్మొహమాటంగా చెప్పేసిందట. అందువల్ల బరువెక్కి ప్రయోగాలు చేయలేనని తెలిపిందట. ‘మహానటి’లో కీర్తి దాదాపు 150 కాస్టూమ్స్ ధరించిందని సమాచారం.  ‘మహానటి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.