వచ్చిన అవకాశాల్లో నచ్చిన పాత్రలకు ‘ఓకే’

“నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. ప్రేక్షకుల అభినందనలు పొందాలి “… అని అంటోంది కీర్తీ సురేష్‌. ‘ ఎలాంటి పాత్రలను ఇష్టపడతారు. ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు’ ? అని కీర్తీ సురేష్‌ ని అడిగితే… ‘‘నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. ప్రేక్షకుల మెప్పు పొందాలి. ఏదో ఒక తరహా పాత్రలకే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. ‘క్వీన్‌’ సినిమాలో కంగనా రనౌత్…‘మరియాన్‌’లో పార్వతి పాత్రలంటే నాకు చాలా ఇష్టం. అయితే, అలాంటి పాత్రలే నాకు రావాలని కోరుకోను. నాకు వచ్చిన అవకాశాల్లో ..నచ్చిన పాత్రలకు ‘ఓకే’ చెబుతుంటాను. కాలంతో ముందుకు వెళ్తుంటా. భవిష్యత్‌ గురించి పెద్దగా ఆలోచించను ’’ అని చెప్పింది .
ఆరేళ్ల క్రితం న‌టిగా జ‌న్మించాను !
కీర్తి సురేష్ న‌టిగా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్ల‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఎమోష‌న‌ల్ మెసేజ్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ… త‌నను ఆద‌రిస్తున్నందుకు ‘థ్యాంక్స్’ చెప్పారు. “ఆరేళ్ల క్రితం న‌టిగా జ‌న్మించాను. వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించే అదృష్టం ద‌క్కింది. మీ ప్రేమాభిమానాలు నాపై చూపించినందుకు థ్యాంక్స్‌. నేనీ స్థాయిలో ఉండ‌టానికి నా కుటుంబం… నా స‌న్నిహితులే కార‌ణం .అంద‌రికీ థ్యాంక్స్‌. మీ మీ సీట్ల‌లో మీరు కూర్చోండి. మనం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంది`అని అంది కీర్తి సురేష్.
‘పెంగ్విన్’ లో గర్భిణిగా
కీర్తీ సురేష్‌ను ‘సర్కార్‌’ చిత్రం తరువాత తెరపై చూడలేదు. ఆమెకు బాలీవుడ్‌ నుంచి కాల్‌ వచ్చింది. అక్కడి సినీ ప్రియులకు హీరోయిన్లు బొద్దుగా ఉంటే నచ్చరు. కీర్తీ సురేష్‌ స్లిమ్‌గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక డైట్‌లు… ఎక్సర్‌సైజ్‌లు అంటూ చేయక తప్పలేదు. దాంతో ఈ అందాల బొమ్మ చిక్కి మరింత చక్కగా తయారైంది.
 
కీర్తీ సురేష్‌ ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ స్పోర్ట్స్ బయోపిక్‌ ‘మైదాన్’ లో చేస్తోంది . బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జంటగా నటిస్తోంది. మణి రత్నం’పొన్నియన్ సెల్వం’లో కూడా కీర్తి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ‘మిస్ఇండియా’, నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ ..నితిన్ తో ‘రంగ్ దే’ .. మలయాళంలో మోహన్ లాల్ తో  ‘మరక్కర్’ చేస్తోంది . తమిళంలో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఇది. ‘పిజ్జా’, ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ గర్భవతి పాత్రలో నటించారు .’పెంగ్విన్‌’ చిత్రీకరణ ముగిసింది. “ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని కీర్తీసురేష్‌ చెప్పింది . కీర్తీసురేశ్‌ కోసం రజనీకాంత్ కొత్త చిత్రం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.