తోట పని.. వంట పని.. వ్యవసాయం కూడా చేస్తా !

కీర్తి సురేష్… తన బర్త్‌డే గిఫ్ట్‌ గా తన అభిమానులకు ఊహించని షాక్‌ న్యూస్‌ ఒకటి వెల్లడించింది. అదేమిటంటే … సినిమాలకు బ్రేక్‌ ఇస్తుందట. సడన్‌గా రెండు నెలల పాటు సినిమాకు బ్రేక్‌ ఇచ్చి తోటమాలినవుతున్నానంటోంది.  ఇది నిజం. దక్షిణాదిలో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయకి కీర్తి. ఒక్క మహానటి చిత్రంతోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది.  విజయ్‌తో ‘సర్కార్’, విశాల్‌కు జంటగా ‘సండైకోళి– 2’ చిత్రాలు చేస్తూ కమర్శియల్‌ చిత్రాల హీరోయిన్‌గానూ రాణిస్తోంది.
 
కీర్తి సురేష్ కి వరుసగా మూడు విశేషాలు వరుసగా వచ్చి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నెల 17న ఈ అమ్మడు పుట్టిన రోజు జరుపుకోనుంది. మరో విశేషం ఈమె నటించిన ‘సండైకోళి–2′(పందెంకోడి2) చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఇక మూడోది విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న ‘సర్కార్‌’ చిత్రం టీజర్‌ ఈ నెల 19న విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగాఈ షాక్‌ న్యూస్‌  వెల్లడించింది. అదేమిటంటే.. రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇస్తుందట. ఇందుకు ఆ అమ్మడు చెప్పే రీజన్‌ మూడేళ్లగా రెస్ట్‌ లేకుండా నటిస్తున్నాననే. ఈ మూడేళ్లలో ఇన్ని చిత్రాలు చేశానా? అని తనకే ఆశ్చర్యంగా ఉందంటున్న కీర్తీ విరామం లేకుండా, సరిగా నిద్రకూడా పోవడానికి సమయం లేనంతగా నటించానని చెప్పింది.అదే సమయంలో కొత్తగా మరో 20 కథలు విన్నానని, అయితే వాటిలో దేనికీ ఇంకా ఓకే చేయలేదని చెప్పింది. ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగని విదేశాలకు వెళ్ళే ఆలోచనలేమీ లేవు అని చెప్పింది. ఇంట్లోనే ఉంటానని, తోట పని చేస్తాను, కవితలు రాస్తాను, వంటలు చేస్తాను. వ్యవసాయం చేయడం కూడా నేర్చుకున్నాను, అది కూడా చేస్తాను అని అంటోంది. ఆ తరువాతనే మళ్లీ నటిస్తానని కీర్తి సురేష్ పేర్కొంది. ప్రస్తుతం చేస్తున్న మలయాళ చిత్రం పూర్తి చేసి నటనకు చిన్న బ్రేక్‌ తీసుకోనుందట.