‘మిస్ ఇండియా’ నుండి ‘కొత్తగా కొత్తగా’ పాట వచ్చింది!

‘మిస్ ఇండియా ‘చిత్రాన్ని మార్చి నెల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ చిత్రంలో తొలి పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న మూవీ ‘మిస్ ఇండియా’. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.
 
‘‘కొత్తగా కొత్త‌గా కొత్త‌గా రంగులే నింగిలో పొంగి సారంగ‌మై
లిప్త‌లో క్షిప్త‌మై కాన‌నే కాల‌మే మొల‌క‌లే వేసె నా సొంత‌మై…’’ అంటూ సాగే ఈ పాట‌లో హీరోయిన్ జీవితంపై త‌న‌కున్న పాజిటివ్ దృక్ప‌థాన్ని తెలియ‌జేస్తుంది. ఈ సాంగ్‌ను యూర‌ప్‌లో అంద‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోష‌ల్, త‌మ‌న్ పాట‌ను పాడారు.
 
నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – “ కీర్తి సురేశ్‌ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్ర‌స్తుత సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌ర‌పుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి నెల‌లో విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.
 
కీర్తి సురేశ్‌,జ‌గ‌ప‌తిబాబు,వి.కె.న‌రేశ్‌,న‌వీన్ చంద్ర‌,న‌దియా
రాజేంద్ర ప్ర‌సాద్‌,భాను శ్రీ మెహ్ర‌,పూజిత పొన్నాడ‌,క‌మ‌ల్ కామ‌రాజు నటీనటులు. 
కెమెరా: సుజిత్ వాసుదేవ్‌, డాని షాన్‌సెజ్ లోపెజ్‌,ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌: సాహి సురేశ్‌,ర‌చ‌న‌: న‌రేంద్ర‌నాథ్‌, త‌రుణ్ కుమార్‌