పారితోషికం కోసం కాదు, యాక్టింగ్ ఇష్టపడి వచ్చా !

నేను పారితోషికం కోసం నటించడానికి రాలేదు. నటనను ఇష్టపడి, ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. నేను ఎలాంటి చిత్రంలో ఉన్నానన్నదే ముఖ్యం. పారితోషికం అన్నది ఆ తరువాత అంశమే …..అంటూ చెప్పింది  ‘ఎక్కువ పారితోషికం ఇస్తున్నందున  తెలుగు చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నార’నే ప్రచారానికి  సమాధానంగా కీర్తి సురేష్

మా అమ్మానాన్నలు సినిమాకు చెందిన వారన్నది నాకు ఒక ఎంట్రీకార్డు అంతే. ఆపై నేను నటిగా నిలదొక్కుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే నటిగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేను చాలా అదృష్టవంతురాలిని.

మానాన్న, శివకుమార్‌(హీరో సూర్య తండ్రి)తో మూడు చిత్రాలు నిర్మించారు . సూర్యను టీవీలో చూసినప్పుడు ‘ఈయనకు జంటగా నేను నటిస్తాను’ అని సరదాగా అనేదాన్ని. అయితే నిజంగా నటిస్తానని అనుకోలేదు. అది ఇప్పుడు జరుగుతోంది. సూర్య చాలా ప్రశాంతంగా ఉంటారు. నిజ జీవితంలో చాలా మందికి విద్యాదానం చేస్తున్నారు.చాలా మంచి మనిషి…….  అని చెప్పింది సూర్యకు జంటగా ‘తానాసేర్న్‌ద కూటం’ చిత్రం లో నటిస్తున్న విషయాన్ని అడిగినప్పుడు
‘సామి-2’ చిత్రంలో నటి త్రిషతో కలిసి నటించనున్న  విషయాన్ని ప్రస్తావిస్తే…. ‘సామి’ చిత్రంలో త్రిష నటించారు. ‘పార్టు-2’లో ఆమె అవసరం అయ్యారు. అయినా చిత్రంలో ఒక కథానాయకి అవసరమా? ఇద్దరు అవసరమా? అన్నది కథ నిర్ణయిస్తుంది. అందులో మనకు ఉన్న ప్రాధాన్యత ఏమిటన్నదే ముఖ్యం అన్నది నా భావన.