హీరో కు కీర్తి సురేష్ వెరైటీ బహుమతి

విజ‌య్ బ‌ర్త్ డే జూన్ 22 సంద‌ర్బంగా ఓ వైపు అభిమానులు మ‌రో వైపు సినీ సెల‌బ్రిటీలు ఎవ‌రికి న‌చ్చిన స్టైల్ లో వారు బ‌ర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ స్టార్ హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ కి కీర్తి సురేష్ వెరైటీ స్టైల్ లో విజయ్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది . “విజ‌య్ కోసం నేనే స్వ‌యంగా వేసిన పెయింటింగ్ “అంటూ ఫోటోలతో పాటు చిన్న ఆర్ట్ వ‌ర్క్ అనే కామెంట్ సోష‌ల్ మీడియాలో పెట్టింది.

కీర్తి ఆర్ట్ వర్క్ ని చూసి ఈ అమ్మ‌డి అభిమానులే కాదు , విజయ్ అభిమానులు కూడా తెగ మురిసిపోతున్నారు. మ‌ల్టీ టాలెంటెడ్ కీర్తి .. విజ‌య్ తో క‌లిసి “భైర‌వ” అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో “ఏజెంట్ భైర‌వ” అనే టైటిల్ తో జూలై రెండో వారంలో విడుద‌ల కానుంది.