నేను ‘ఓవర్‌నైట్‌’ స్టార్‌ని కాలేదు!

“నేను ఓవర్‌నైట్‌ స్టార్‌ని కాలేదు. అయితే, ఊహించినదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి పేరు వచ్చింది”..అని చెప్పింది కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో ఆమె కెరీర్‌ జోరుగా సాగుతోంది. ఈ విషయం గురించి కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ…
‘‘నేను ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ కెరీర్‌లో రిస్క్‌ తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. నేనీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను.నేను ఓవర్‌నైట్‌ స్టార్‌ని కాలేదు. అయితే, ఊహించినదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి పేరు వచ్చింది.. అలాగే ఇంత తక్కువ సమయంలో ‘మహానటి’ చిత్రానికి జాతీయ అవార్డు సాధిస్తానని కూడా ఊహించలేదు. నేను చేసిందల్లా శక్తివంచన లేకుండా నా పాత్రలకు న్యాయం చేయడమే’’ అన్నారు.
 
ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో ?
కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు..ఆమె ఒక ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడు,కేరళకి చెందిన బిజినెస్‌మేన్‌ని పెళ్లాడబోతుందని..ఈ ఏడాది చివరిలో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు, నటుడు ఫూల్‌వాన్‌ రంగనాథన్‌ ఒక మీడియా సమావేశంలో చెప్పారు..
ఈ విషయమై కీర్తీ సురేష్‌ తల్లి మేనకను అడిగితే  ..‘‘పెళ్లి వార్తలు ఉట్టి పుకార్లు’’ అని స్పష్టం చేశారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కీర్తీ సురేష్‌ కూడా కొట్టిపారేశారు… “ఈ వార్తలు విని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కాదు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం మనందరం దృష్టి పెట్టాల్సిన విషయం కరోనా వైరస్‌. దానిపై పోరాటం చేద్దాం. ఇలాంటి అసత్యపు వార్తల్ని ప్రచారం చేయొద్దు’’ అని చెప్పింది కీర్తీ సురేష్‌.
 
రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కీర్తీ సురేష్‌. అలాగే ఇటు తెలుగు, తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ‘మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖి, పెంగ్విన్‌ ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.ప్రముఖ దర్శకుడు కుకునూర్‌ నగేశ్‌ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాఫ్‌ సినిమాలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ‘గుడ్‌ లక్‌ సఖి’ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారు.