ప్ర‌భాస్ లాంచ్ చేసిన ‘గుడ్‌ల‌క్ స‌ఖి’‌ టీజ‌ర్‌

జాతీయ స్థాయి న‌గేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తోన్న ‘గుడ్ ల‌క్ స‌ఖి’ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళంలో త్రిభాషా చిత్రంగా ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతోంది.దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వ‌ర్మ నిర్మిస్తున్నారు. ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మిన‌హా..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి.
 
కీర్తి సురేష్ ‘గుడ్‌ల‌క్ స‌ఖి’‌ టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లాంచ్ చేశారు.త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్‌ను విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళం వెర్ష‌న్ టీజ‌ర్‌ను అక్క‌డి పృథ్వీరాజ్ సుకుమార‌న్ రిలీజ్ చేశారు.
హాస్యం పండించే ప‌లు స‌న్నివేశాలు, చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి జోడీ, వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్‌, మంచి డ్రామా, కృషితో ఏ స్థాయికైనా ఎద‌గ‌వ‌చ్చ‌నే అంశం, మ‌న రాత‌ను మ‌న‌మే మార్చుకోవాల‌నే సందేశంతో టీజ‌ర్ ఇంప్రెసివ్‌గా క‌నిపిస్తోంది.
 
.దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఇచ్చిన‌ మ్యూజిక్ అల‌రించేదిగా ఉండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్ అనిపిస్తోంది. నిర్మాత‌ల్లో ఒక‌రైన శ్రావ్య వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అధిక శాతం మ‌హిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం.
 
కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌ ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణం