ప్రేమించి పని చేస్తే.. విజయాన్ని సాధించినట్లే!

“నేను ధరించిన దుస్తులు అందంగా ఉంటాయి అంటున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై నాకున్న ఆసక్తి అందుకు కారణం. ఎవరు ఏ వృత్తిని చేసినా.. మనస్ఫూర్తిగా ప్రేమించి చేస్తే, ఆనందంతో పాటు ఫలితం ఉంటుంది. సంతోషంగా పని చేస్తే విజయాన్ని సాధించినట్లే!”..అని చెప్పింది నటి కీర్తీసురేష్. తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది కీర్తి సురేష్. మాలీవుడ్‌లో నటిగా తెరంగేట్రం చేసినా.. పేరు సంపాయించింది మాత్రం టాలీవుడ్, కోలీవుడ్‌లోనే . తెలుగులో ఆమె నటించిన ‘మహానటి’ చిత్రంతో ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే సాధించింది.జాతీయ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 23న‌ ఢిల్లీలోజ‌రిగింది. ఉప రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు ఈ అవార్డుల‌ను విజేతలకు అంద‌జేశారు. ‘మహానటి’గా న‌టించిన కీర్తి సురేష్ ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకుంది.
 
కీర్తి సురేష్ తక్కువ సమయంలోనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా నాయకి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ…
“నేను ధరించిన దుస్తులు అందంగా ఉంటున్నాయి అంటున్నారు. అందుకు కారణం ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై నాకున్న ఆసక్తి. ఎవరు ఏ వృత్తిని చేసినా మనస్ఫూర్తిగా ప్రేమించి చేస్తే.. ఫలం, ఆనందం లభిస్తాయి. పని సంతోషంగా చేస్తే విజయం తప్పదు. అంతా వారికి ఇష్టమైన వృత్తిని ఎంచుకోవాలి. నాప్రతిభను నిరూపించుకునే కథా పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. అలాంటి పాత్రలనే కోరుకుంటున్నాను. తమిళం, తెలుగులో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నాను. సుస్థిరమైన స్థానం లభించింది.ప్రాదాన్యత కలిగిన పాత్రలను సమర్థవంతంగా పోషించగలననే పేరు పొందాను. ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఆ చిత్రం కధ.. నా పాత్ర ..ఎవరు పనిచేస్తున్నారు? వంటి విషయాలు తెలుసుకున్న తరువాతే అంగీకరిస్తున్నాను. అందరూ ఒకే భావనతో ,సమష్టిగా పనిచేస్తేనే.. జయించగలం.విజయం పొందగలం. నేను హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో పాటు, కమర్శియల్‌ చిత్రాల్లోనూ నటించాలను కోరుకుంటున్నా”నని నటి కీర్తి సురేష్ పేర్కొంది.
 
రజినీకాంత్‌ కోసం.. మణిరత్నంకు’నో’
ప్దముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `పొన్నియన్ సెల్వన్`. కల్కి కృష్ణమూర్తి రచించిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పలు భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, మోహన్ బాబు, కార్తీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఆ జాబితాలో కీర్తి సురేష్ పేరు కూడా ఉంది. అయితే ఆమె తాజాగా ఈ సినిమా నుంచి తప్పుకుంది . సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో నటించే అవకాశం రావడం వల్లే కీర్తి.. మణిరత్నం సినిమాకు `నో` చెప్పినట్టు సమాచారం. రెండు సినిమాలకు డేట్లు అడ్జెస్ట్ చేయడం కుదరకపోవడంతో మణిరత్నం సినిమాను వదులుకున్నట్టు తెలుస్తోంది.ఆ మె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణ‌మంటూ ఏదీ లేద‌ని, డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డ‌మేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. కీర్తి సురేష్ స్థానంలో త్రిష న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.
 
కీర్తీ సురేష్‌కు బాలీవుడ్‌ నుంచి కాల్‌ వచ్చింది. అక్కడి సినీ ప్రియులకు హీరోయిన్లు బొద్దుగా ఉంటే నచ్చరు. కీర్తీ సురేష్‌ స్లిమ్‌గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక డైట్‌లు… ఎక్సర్‌సైజ్‌లు అంటూ చేయక తప్పలేదు. దాంతో ఈ అందాల బొమ్మ చిక్కి మరింత చక్కగా తయారైంది.కీర్తీ సురేష్‌ ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ స్పోర్ట్స్ బయోపిక్‌ ‘మైదాన్’ లో చేస్తోంది . ప్రస్తుతం నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ‘మిస్ఇండియా’, నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ ..నితిన్ తో ‘రంగ్ దే’ .. మలయాళంలో మోహన్ లాల్ తో ‘మరక్కర్’ చేస్తోంది . తమిళంలో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘పెంగ్విన్ ‘. ‘పిజ్జా’, ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ గర్భవతి పాత్రలో నటించారు. కీర్తీసురేష్ రజనీకాంత్ కొత్త చిత్రంలో, శివ దర్శకత్వంలో రజని కూతురుగా నటిస్తోందని అంటున్నారు.