అందం పోయే.. అవకాశమూ పోయే!

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలగాలని కీర్తి సురేష్‌ కలలు కన్నది. అవన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. కీర్తికి బాలీవుడ్‌ ఛాన్స్‌ మిస్సయింది. మొన్నటి వరకూ కీర్తి బరువు మీద ఓ రేంజ్‌లో జోకులు వేసుకున్నారు. ఆమె బరువే ఆమెకు శాపమైందనీ, అందుకే అవకాశాలు రావడంలేదన్న సెటైర్లు వినిపించాయి. ఇవన్నీ నిజమే అనుకుని కీర్తి ..పాపం ఎంతో కష్టపడి బరువు తగ్గి స్లిమ్‌గా మారింది. ఆమెకు బాలీవుడ్‌లో అవకాశమొచ్చిందనీ, అందుకే సన్నపడిందన్నారు. అది కొంత వరకూ నిజమేనని కీర్తి అంగీకరించింది కూడా. కీర్తి బాలీవుడ్‌ బాట పట్టగానే ఒక్కసారిగా చిక్కిపోయి సన్నగా కనపడుతోంది. సన్నగా, నాజూకుగా కనపడుతోందే తప్ప ముఖంలో మునుపటి కళ కోల్పోయింది. ముఖం పీలగా, పేలవంగా తయారైంది. ఆ అవతారంలో ఉన్న తన ఫోటోను కీర్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి ముద్దుగా ఉందనీ, ఇప్పుడు కళా విహీనంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత బాలీవుడ్‌కి వెళ్ళినా తన సహజసౌందర్యాన్ని కోల్పోవడమేమిటన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.
బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలగాలని కీర్తి కలలు కూడా కన్నది. అవన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. కీర్తికి బాలీవుడ్‌ ఛాన్స్‌ మిస్సయింది. అజయ్ దేవగన్ ‘మైదాన్’ సినిమాలో ఆమె స్థానంలో ప్రియమణి వచ్చి చేరింది. కారణం.. కీర్తి సన్నబడి, చిన్నపిల్లలా కనిపించడమేనట. లావుగా ఉంటే లావుగా ఉన్నావన్నారు….ఇప్పుడు సన్నపడితే చిన్నపిల్లలా వున్నావంటున్నారు..మరి ఎలా?… అంటూ కీర్తి తన సన్నిహితుల వద్ద వాపోతూ.. దీనిపై ఓ క్లారిటీకి రావాలని ఫిక్సయిందట. అంటే లావుగా ఉండాలో.. లేక సన్నగా ఉండాలో అనే విషయంపై త్వరలోనే తనో నిర్ణయానికి వస్తుందట.
 
విభిన్న కథాంశాలతో ఆరు చిత్రాలు
కీర్తి సురేష్‌ వరుస చిత్రాలతో సందడి చేయబోతోంది. ఒక్క మార్చి నెలలోనే రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో అలరించనుంది. కీర్తి సురేష్‌ గత ఏడాది ‘మన్మథుడు 2’లో అతిథి పాత్రకే పరిమితమైంది. ఈ సంవత్సరం ఏకంగా అరడజను చిత్రాలతో పలకరించబోతోంది. మరీ ముఖ్యంగా మార్చి నెలలో మూడు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో సందడి చేయనుంది. మార్చి 6న తెలుగు చిత్రం ‘మిస్ ఇండియా’తో … అదే నెల 26న పాన్ – ఇండియా ప్రాజెక్ట్ అయిన మలయాళ మూవీ ‘మరక్కర్’తో ఎంటర్ టైన్ చేయనుంది. సమ్మర్ సీజన్ లో ‘రంగ్ దే’, ‘పెంగ్విన్’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక ఏడాది ద్వితీయార్ధంలో రజనీకాంత్ కి కూతురుగా నటిస్తున్న పేరు నిర్ణయించని తమిళ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఆరు చిత్రాలు కూడా విభిన్న కథాంశాలతోనే తెరకెక్కుతున్నాయి. మరి… వరుసపెట్టి రిలీజ్ కానున్న ఈ సినిమాలతో కీర్తి ఇక దక్షిణాదిలోనే బిజీ కానుంది.