ఎంత కీర్తి అయినా.. అంతగా కలిసి రాలేదు !

కీర్తిసురేష్ కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ క్రేమంలోనే ఆమె ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలూ ఓటీటీ లో  విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఓటీటీ వేదికగా విడుదలైన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. అయతే ఓటీటీ కీర్తిసురేష్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.  ఇప్పుడు కీర్తిసురేష్ నటించిన మరో  సినిమా కూడా ఓటీటీ‌లోనే రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. తమిళంలో కీర్తి సురేశ్ ఒక విభిన్నమైన సినిమాను చేసింది. మహేశ్వరన్ దర్శకత్వంలో ‘సానికాయిధమ్’ రూపొందింది. ఈ సినిమాలో సెల్వ రాఘవన్ కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి  పోస్టర్ అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టు పూర్తిచేసుకుంది. త్వరలోనే  ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌ను ఇచ్చిందని  తెలుస్తోంది .కీర్తితో పాటు ఈ చిత్రంలో ప్రముఖ తారలు నటించారు.

ఆశలన్ని ‘సర్కారు’ సినిమాపైనే !… తమిళ్‌‌‌లో కీర్తిసురేష్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురేశ్‌‌‌కి తాజాగా తమిళంలో మరో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న సినిమాలో కీర్తి హీరోయిన్‌‌‌‌గా ఛాన్స్ దక్కించుగుకుందని తెలుస్తోంది. సూర్య సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిని హీరోయిన్‌‌‌గా ఎంపిక చేశారట. ఇక హీరోగా అధర్వ  నటిస్తుండగా జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. మలయాళంలో భరత్ సినిమాలో బిజీగా ఉంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారి పాట’ లో హీరోయిన్‌గా చేస్తుంది కీర్తి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.. ఇప్పుడు కీర్తి సురేష్ ఆశలన్ని ఈ సినిమాపైనే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

రజిని,చిరంజీవి చెల్లిగా… కీర్తి డిఫరెంట్‌ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌గానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్‌ రోల్స్‌ చేసేందుకూ సై అంటోంది. అందులో భాగంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో రజనీ సోదరిగా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి చెల్లిగా నటించేందుకు రెడీ అవుతుందట! తమిళ హిట్‌ మూవీ ‘వేదాళం’ తెలుగులో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే కదా! మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించనున్నాడు. ఇందులో మెగాస్టార్‌ సోదరిగా సాయిపల్లవి లేదా కీర్తి సురేశ్‌ను తీసుకోవాలనుకున్నారట. అందులో భాగంగా తొలుత కీర్తిని సంప్రదించగా.. ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది .అన్న – చెల్లెలి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ ‘భోళా శంకర్’ చిత్రంలో ఆయన చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.’భోళా శంకర్‌’లో చిరు చెల్లిగా కీర్తి నటిస్తుందనగానే అందరిలోనూ అంచనాలు బాగా మొదలయ్యాయి.