నీ మొహం మీద చిరునవ్వు చెదిరిపోకూడదు !

“నేను మాత్రం రేపటి గురించీ, ఎల్లుండి గురించీ, వచ్చేవారం గురించీ, వచ్చేనెల గురించీ ఆలోచించి బుర్ర పాడుచేసుకోను”… అని అంటోంది కియారా అద్వాని. సినీ పరిశ్రమ అంటేనే ఒత్తిడి. షూటింగ్‌, డబ్బింగ్‌, ప్రమోషన్‌.. కాలంతో పోటీపడి పరుగుతీస్తున్నట్టే ఉంటుంది. “నీ చేతిలో ఉన్న ఇరవై నాలుగు గంటల గురించే ఆలోచించు. రేపటి గొడవ నీకెందుకు? ఎప్పుడూ నీ మొహం మీద చిరునవ్వు చెదిరిపోకూడదు” అని చెబుతూ ఉంటుంది అమ్మ. ఆ సూత్రాన్నే నేను పాటిస్తాను.

కొత్త స్నేహాల కోసం మనసు ద్వారాలను తెరిచే ఉంచాలి. మన ఆలోచనలు ఓపెన్‌గా ఉండాలి.  ప్రతి పరిచయం అమూల్యమైందే. ధోనీ సతీమణి సాక్షీసింగ్‌ తొలి పరిచయంలోనే నా ఆత్మీయురాలి జాబితాలో చేరిపోయారు. ‘ఎమ్‌.ఎస్‌.ధోనీ- ఎన్‌ అన్‌టోల్డ్‌ స్టోరీ’లో నేను సాక్షి పాత్ర పోషించాను. తన హావభావాలను అధ్యయనం చేయడానికి మొదటిసారి కలిశాను. ధోనీతో వివాహ ఘట్టం షూటింగ్‌లో.. పెండ్లి కూతురి పాత్రలో నేను సాక్షీసింగ్‌ పెండ్లి చీరనే కట్టుకున్నాను. తనే సంతోషంగా ఇచ్చింది.

బయోపిక్‌లో నటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఆ పాత్ర తాలూకు వ్యక్తి తెర మీద సినిమా చూస్తున్నప్పుడు.. తనతో తాను ప్రేమలో పడాలి! అప్పుడే, నా నటనకు సార్థకత.ఫెయిల్యూర్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను. ఆమాటకొస్తే.. నా తొలిచిత్రం విజయం సాధించలేదు. మరో అవకాశం వస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. రెండో సినిమా అంతంతమాత్రంగానే ఆడింది. మూడోదీ అంతే! అందుకే, వైఫల్యాలు నన్ను బాధించవు. విజయాలకూ పొంగిపోను.

సిద్ధార్ధ్ నాకు అత్యంత సన్నిహితుడు!…  ఎప్పటికైనా తాను ప్రేమించి మాత్రమే పెళ్లి చేసుకుంటానని కియారా  స్పష్టం చేశారు. మహేశ్ బాబు హీరోగా వచ్చిన ’భరత్ అనే నేను‘ సినిమాతో కోలీవుడ్ లో కియారా అడుగు పెట్టారు. అనంతరం రామ్ చరణ్ కు జోడీగా ’విన‌య విధేయ రామ‘ సినిమాలో నటించారు. కియారా బాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.  బాలీవుడ్ న‌టుడు సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో కియారా ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తల విషయం తెలిసిందే. వీరిద్దరు హాలీడే వెకేషన్స్ కు వెళ్లడంతో వీరు ప్రేమలో ఉన్నట్టు బిటౌన్ లో వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ‘షేర్షా’ అనే సినిమాలో నటించారు.  సిద్ధార్ధ్ మంచి న‌టుడని, త‌న ప‌నిపై అత‌నికి ఫోక‌స్ బాగా ఉంటుందని కియారా పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో సిద్ధార్ధ్ తనకు అత్యంత సన్నిహితుడని, తాము మంచి స్నేహితులమని ఆమె తెలిపారు. అయితే తాను అరెంజ్‌డ్‌ మ్యారేజ్‌ చేసుకోనని, ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని.. కియారా తేల్చిచెప్పారు. దీంతో ఆమె సిద్ధార్ధ్ ప్రేమలో ఉందన్న ప్రచారానికి బలం చేకూరింది. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ తో కలిసి శంకర్ దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.