నాకు కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది !

’భరత్ అనే నేను‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ’కైరా అద్వానీ‘. ఈ సినిమాతో ఆమె పాపులర్ హీరోయిన్ గా మారింది. కైరా మీడియాతో చిట్ చాట్ చేసింది. తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని కైరా వెల్లడించింది. తన తల్లిదండ్రులది ప్రేమ పెళ్లేనని, వారి అనుబంధం చూస్తుంటే తనకు కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలనిస్తోందని ఆమెచెప్పింది.తాను ప్రేమలో పడితే ఇంట్లో తప్పనిసరిగా చెబుతానని ఆమె తేల్చిచెప్పింది. ఫిట్ నెస్ విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె అంది. ఫిట్ గా ఉండాలంటే అనునిత్యం జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదని, కాలినడకే అన్నింటికంటే గొప్ప వ్యాయామమని ఆమె పేర్కొంది . ఈ సందర్భంగా కైరా తన అభిమానులకు కొన్ని ఫిట్ నెస్ టిప్స్ కూడా చెప్పింది. కైరా నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
 
ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగా !
కియారా ఆడ్వాణీ పేరు ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. ఇటీవ‌ల విడుద‌లైన `కబీర్ సింగ్‌` సినిమాతో కియారాకు ఎన‌లేని గుర్తింపు ల‌భించింది. న‌టిగా స‌త్తాచాట‌డం, బోల్డ్‌గా న‌టించ‌డానికి వెనుకాడ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో కియారాకు అవ‌కాశాలు పుష్క‌లంగా వ‌స్తున్నాయి. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ న‌టిస్తోంది. గ‌తేడాది వ‌చ్చిన `ల‌స్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్‌తోనే కియారాకు మంచి గుర్తింపు ల‌భించింది. ఆ సినిమాలో బోల్డ్‌గా న‌టించి యువ‌త‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది.
ఈ వెబ్ సిరీస్ చేయ‌క‌పోతే చాలా న‌ష్ట‌పోయేదాన్నని ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో కియార చెప్పింది. “లస్ట్‌ స్టోరీస్‌` చేయకుండా ఉండాల్సింద‌ని ఒక్క క్ష‌ణం కూడా అనుకోలేదు. ఆ వెబ్ సిరీస్ చేయ‌క‌పోతే నేను చాలా కోల్పోయేదాన్ని. కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒక్క అవ‌కాశం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగా. `ధోనీ` సినిమా త‌ర్వాత కూడా చాలా ఆడిష‌న్‌లు ఇచ్చా. అయితే `ల‌స్ట్ స్టోరీస్‌` త‌ర్వాత ఆ అవ‌స‌రం రాలేద‌`ని కియారా చెప్పింది.