నన్నెంతో ఆవేదనకు గురిచేసింది!

“కామెంట్స్‌ చేసే ముందు పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేసింది కైరా అద్వానీ. ‘ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. అలాంటి వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూసి కామెంట్స్‌ చేయడం తగదు. కామెంట్స్‌ చేసే ముందు పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది కైరా అద్వానీ.
డబూ రత్నాని రూపొందించిన బాలీవుడ్‌ క్యాలెండర్‌లో కైరా కేవలం ఆకును అడ్డం పెట్టుకుని ఇచ్చిన ఫోజులు చూసి నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు చేశారు. కొన్నేళ్ళ క్రితం సీనియర్‌ నటి టబు కూడా ఇదే క్యాలెండర్‌ కోసం టాప్‌లెస్‌గా ఎలా అయితే ఫొజులిచ్చిందో… కైరా కూడా అలాగే ఫొజివ్వడమే ఈ కామెంట్లకి కారణం. దీనిపై కైరా స్పందిస్తూ..’నేను టబుని అనుకరించలేదు. ఫొటోగ్రాఫర్‌ ఇచ్చిన సూచనల మేరకు యాదృచ్ఛికంగా అలాంటి ఫొజివ్వాల్సి వచ్చింది. దీనిపై కామెంట్లు రావడం చాలా బాధగా ఉంది. సినిమాల్లో కూడా నేను పోషించే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా. కథ విన్న తర్వాత అందులోని నా పాత్ర ని గతంలో ఎవరైనా చేశారా లేదా అని క్రాస్‌ చెక్‌ చేసుకుంటా. అలాంటిది ఓ ఫొటో విషయంలో నాపై కామెంట్లు రావడం నన్నెంతో ఆవేదనకు గురిచేసింది’ అని చెప్పింది.
 
మన పంథాని మార్చుకోవాల్సిందే!
“ఒకే రకమైన పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. కాబట్టి వారి అభిరుచి మేరకు మన పంథాని సైతం మార్చుకోవాల్సిందే” అని కైరా అంటోంది .’ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే రకమైన పాత్రలు చేస్తే మనుగడ కష్టం’అని అంటోంది .’ఇటీవల వచ్చిన ‘కబీర్‌సింగ్‌’, ‘గుడ్‌న్యూజ్‌’ చిత్రాల్లో నేను పోషించిన పాత్రలు వేటికవే భిన్నం. అలాగే ప్రస్తుతం నటిస్తున్న ఐదు చిత్రాల్లోని పాత్రలు కూడా ఒకదానితో మరొకటి సంబంధం ఉండదు. ఓ నటిగా ఈ తరహా పాత్రల్ని ఛాలెంజింగ్‌గా ఫీలవుతాను. పైగా ఇప్పుడు ఒకే రకమైన పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. కాబట్టి వారి అభిరుచి మేరకు మన పంథాని సైతం మార్చుకోవాల్సిందే’ అని కైరా అంటోంది .
 
గతేడాది బాలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో మంచి సినిమాలతో మంచి విజయాల్ని సాధించిన కైరా ప్రస్తుతం ‘గిల్టీ’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘ఇందూ కీ జవానీ’, ‘షేర్షా’, ‘భూల్‌భలయ్య 2’ వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.