ఇటువంటివి తప్పవని న‌టి గా నా‌కు తెలుసు !

‘ల‌క్ష్మీబాంబ్’ మూవీ నుంచి అక్ష‌య్ కుమార్, కైరా అద్వానీ నటించిన ద్యుయట్ ‘బుర్జ్ ఖ‌లీఫా’ వీడియో సాంగ్ ను విడుద‌ల చేసారు.. పంజాబ్ అప్ బీట్ ట్రాక్ లో స్టైలిష్ డ్యాన్స్ తో సాగే ఈ పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దుబాయ్ లో బుర్జ్ ఖ‌లీఫా ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకించి  చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్ప‌డు అక్ష‌య్-కైరా బుర్జ్ ఖ‌లీఫా థీమ్ తో సాగే పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.అక్ష‌య్ కుమార్ చాలా గ్యాప్ త‌ర్వాత త‌న‌లోని స్టైలిష్ డ్యాన్సింగ్ స్కిల్స్ తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. మ‌రోవైపు కైరా గ్గామ‌ర‌స్ గా క‌నిపిస్తూ సందడి చేస్తుంది. త‌న అంద‌చందాల‌తో పాట‌కు స్పైసీ లుక్ వ‌చ్చేలా చేసింది. శ‌శి కంపోజ్ చేసిన ఈ పాట‌ను డీజే ఖుషి, నిఖితా గాంధీ అద్బుతంగా పాడారు. గ‌గ‌న్ అహూజా పాట రాశారు. “ఈ ఏడాది అతి పెద్ద డ్యాన్స్ ట్రాక్ ను అందిస్తున్నాం. ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి” అంటూ అక్ష‌య్ ఇన్ స్టాలో సాంగ్ ను షేర్ చేశాడు.

దుబాయి లో ఈ సాంగ్ షూటింగ్ గురించి కొన్ని విష‌యాలు చిట్ చాట్ లో షేర్ చేసుకుంది కైరా.” సినిమా షెడ్యూల్ లో ‘బుర్జ్ ఖ‌లీఫా’ పాట షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేశాం. ఫ్యాన్సీ ఔట్ ఫిట్ లో లొకేష‌న్ కు వ‌చ్చాం. మంచులో చిఫాన్ సారీలో ఉండ‌టం క‌ష్టం. కానీ ఇక్క‌డ‌ కాళ్ల‌కు చెప్పులు లేకుండా మండే ఎండ‌లో కాలిపోతున్న ఇసుక‌లో డ్యాన్స్ చేయాల్సి వ‌చ్చింది. కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తున్న‌పుడు ఇటువంటివి తప్పవని ఓ న‌టి గా త‌న‌కు తెలుసున‌ని, అందుకే ఎంజాయ్ చేస్తూ ఆ పాట‌ షూట్ లో పాల్గొన్నా”మ‌ని కైరా అద్వానీ చెప్పుకొచ్చింది. రాఘ‌వా లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న ల‌క్ష్మీబాంబ్ ‘డిస్నీ+హాట్ స్టార్’ లో న‌వంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

ఏ వంటకం చెప్పినా చేయగలను!… లాక్‌డౌన్‌ సమయంలో పాకశాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించినందుకు తెగ సంబరపడిపోతున్నారు హీరోయిన్‌ కియారా అద్వానీ. లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా గడిపారు ? అనే ప్రశ్నకు కియారా సమాధానం చెబుతూ.. ‘‘నాకు ఇంట్లో కుటుంబసభ్యులతో ఉండటం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ లాక్‌డౌన్‌ నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించ లేదు. కానీ షూటింగ్స్‌ బాగా మిస్‌ అవుతున్నాననిపిస్తోంది. ఇప్పుడు నా డైలీ లైఫ్‌ లో … వర్కవుట్స్‌ మిస్‌ కావడంలేదు. లూడో వంటి ఇండోర్‌ గేమ్స్‌ ఆడుతున్నాను.నా స్కూల్‌ టైమ్‌ వీడియోలు చూస్తున్నాను. ఇటీవలే మా స్కూల్‌ టీచర్స్‌తో కూడా మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది.. నా వంటల గురించి. నాకు ఇంటి వంట అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కేక్, బిస్కెట్లు, హల్వా చేసేదాన్ని. ఇప్పుడు వేరే వంటకాలు కూడా నేర్చుకుంటున్నాను. కొన్ని వంటకాలను ఆన్‌లైన్‌ రెసిపీలను ఫాలో అవుతూ చేశాను. ఇప్పుడు ఎవరైనా ఏ భారతీయ వంటకం పేరు చెప్పినా నేను చేయగలను’’ అని పేర్కొన్నారు.

మరి బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడా?… కియారా అద్వానీ నటించిన చిత్రం ‘ఇందూ కీ జవానీ’. అబిర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇందూ గుప్తా పాత్రలో కనిపిస్తారు కియార. బాయ్‌ఫ్రెండ్‌ దొరక్క ఇబ్బందులు పడే అమాయకపు అమ్మాయి పాత్రలో నటించారామె. చివరికి డేటింగ్‌ యాప్స్‌లోనూ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ప్రయత్నాలు మొదలెడుతుంది ఇందూ. మరి బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ చిత్రం టీజర్‌ విడుదలయింది. ‘నేను తొలిసారి డేట్‌కి వెళ్తున్నాను’ అని ఆ టీజర్‌లో ఇందూ అంటుంది. ఇటీవలే ఈ చిత్రంలో ఓ పాటను విడుదల చేశారు. ‘హసీనా పాగల్‌ దీవానీ….’ అంటూ సాగే ఈ హుషారైన పాటకు కియారా స్టెప్స్‌ అదనపు ఆకర్షణ. గతంలో మైకా సింగ్‌ రూపొందించిన ‘సవన్‌ మే లగ్‌ గయి…’ పాటకు ఇది రీమిక్స్‌. మైకా సింగ్‌తో పాటు ఆశీస్‌ కౌర్‌ రీమిక్స్‌ పాటను ఆలపించారు. ఈ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుందట.