కరోనా కాలంలో కియారా క్రియేటివిటీ

కియారా అద్వానీ చిన్న‌నాటి అభిరుచుల‌ను గుర్తు చేసుకుంటోంది. కుంచె చేత‌ప‌ట్టింది. అమ్మాయి ఫొటో స్కెచ్ వేసింది. ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ కొన‌సాగుతూనే ఉంది. అంద‌రూ ఇంట్లో ఆనందంగా గ‌డిపేందుకు స‌మ‌యం దొరికింది. సెల‌బ్రిటీలంద‌రూ కొత్త అభిరుచుల‌వైపు ఆసక్తి చూపుతున్నారు. వంట‌, డ్యాన్స్‌, పెయింటింగ్ ఇలా ఎవ‌రికి ఇష్ట‌మైన‌వి వారు చేస్తున్నారు. ఈ మ‌ధ్య కియారా అద్వానీ కూడా చిన్న‌నాటి అభిరుచుల‌ను గుర్తు చేసుకోవాల‌నుకున్న‌ది. కుంచె చేత‌ప‌ట్టి అమ్మాయి స్కెచ్ వేసింది. ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇందులో భుజం మీదుగా చూస్తున్న ఒక‌ మ‌హిళ క‌నిపిస్తుంది. అనుభ‌వం ఉన్న క‌ళాకారుడిలా ఈ స్కెచ్ వేసింది కియారా. “ఇన్‌స్టా గ్రామ్’ లో చూసిన త‌ర్వాత నా హ్యాండ్‌ను ప్ర‌య‌త్నించండి” అనే క్యాప్ష‌న్‌తో పోస్ట్ చేసింది.
 
అహంభావం ఉండకూడదు!
కియారా అద్వానీ ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు చేయడంలేదు కానీ హిందీలో బిజీగా ఉన్నారు కియారా. మరి.. పర్సనల్‌ లైఫ్‌ పట్టించుకునే తీరిక దొరుకుతోందా?.. అని కియారాని అడిగితే.. ‘ నా పర్సనల్‌ లైఫ్‌కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. ప్రొఫెషనల్, పర్సనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాను’’ అన్నారు.
కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? అని అనుకున్నారా అంటే.. ‘‘కాబోయే భర్త గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. అతను ఎంతో నమ్మకంగా ఉండాలి… నన్ను నవ్విస్తుండాలి. నా జోక్స్‌కు తను నవ్వాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల తెగువ … ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పగలిగే ధైర్యవంతుడై ఉండాలి. అందరితో మర్యాదగా మసులుకోవాలి. ముఖ్యంగా నేను పురుషుడిని అనే అహంభావం ఉండకూడదు. అది ఉన్నవారిని నేను అస్సలు ఇష్టపడను’’ అని మనసులోని మాటను చెప్పింది కియారా.
 
కియారా కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలైయా 2’ చిత్రీకరణలో ఉన్నారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా అక్షయ్ కుమార్, సిధార్థ్ మల్హోత్రా ‘షేర్‌షా’ చిత్రంలో నటిస్తోంది. ‘ఇందూ కి జవానీ’, రాఘవ లారెన్స్ ‘లక్ష్మి బాంబు’లో కూడా కియారా చేస్తోంది.