కియరా ప్రేమ రూమర్లు నిజమయ్యాయి !

కియారా అద్వానీ లవ్ ఎఫైర్… ఇప్పుడు ఇలాంటి టర్న్‌నే తీసుకుంది. అమ్మడు బాలీవుడ్  హీరో సిద్థార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం.. ఆపై అమ్మాయిగారు అతగాడితో డేటింగ్ కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా సాగించడం లాంటివన్నీ ఒట్టి వదంతులు కాదు.. వాస్తవాలు అని ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షో ద్వారా అందరికీ తెలిసిపోవడంతో బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
‘భరత్ అనే నేను’ చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మన్స్‌తో మెప్పించి మొదటి సినిమాకే అందరి దృష్టిలో పడింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ప్రస్తుతం రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఇంకా చాలా ఆఫర్స్ వస్తున్నా, బాలీవుడ్‌లో కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాలో కియారా నిజంగా సిద్ధార్థతో ప్రేమలో పడిందనే టాక్ ఇప్పుడు గుప్పుమంటోంది. వీరిద్దరినీ కలిపేందుకు ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ రంగంలోకి దిగుతున్నట్లు బాలీవుడ్‌‌లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను కైరా, సిద్ధార్థ్‌లు ఖండించినా, చాలా సందర్భాల్లో వీరిద్దరూ డేటింగ్ చేస్తూ కంటబడ్డారు. అంతేకాదు, వీరిద్దరు ఏకాంతంగా కలుసుకునేందుకు కరణ్ జోహార్ ఇంటినే వాడుకుంటున్నట్లు తెలిసింది.
గతంలో సిద్థార్థ మల్హోత్రా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు తనతో కూడా ప్రేమాయణం సాగించి ఉండడం వల్ల .. ‘కాఫీ విత్ కరణ్ టాక్ షో’కి గెస్ట్‌గా విచ్చేసిన ఆలియాభట్.. చాలా ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేసింది. సిద్ధార్థ ఎవరితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాడని కరణ్ అడిగిన ప్రశ్నకు ఆమె… ‘కియారా అద్వానీ’  అని సమాధానం ఇచ్చి,అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో సిద్ధార్థ్, కియరా రిలేషన్ నిజమేనని తేలిపోయింది.  కియారా త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. 
‘అర్జున్‌రెడ్డి’ని మరింత పెద్దది చేద్దాం !
తెలుగులో గతేడాది విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’. సందీప్‌ రెడ్డి వంగానే ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్‌లో నాయికగా చేస్తున్న కైరాఅద్వాని పాల్గొననుంది. ఈ నేపథ్యంలో హీరో షాహిద్‌ కపూర్‌ ఆమెను ఆహ్వానిస్తూ ట్విట్‌ చేయగా, అందుకు కైరా స్పందిస్తూ… ‘ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. కృతజ్ఞతలు షాహిద్‌ కపూర్‌. ‘అర్జున్‌రెడ్డి’ని మరింత పెద్దది చేద్దాం. టీమ్‌కి అభినందనలు. ఇదొక అద్భుతమైన ప్రారంభం’ అని రీట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ… ‘కబీర్‌ సింగ్‌.. మీకు అర్జున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు’ అని ట్వీట్‌ చేయగా, దీనికి షాహిద్‌ కపూర్‌ స్పందిస్తూ… ‘సినిమాలో మీ పాత్ర చాలా ఇన్‌స్పైర్‌గా ఉంది బ్రదర్‌. ఎన్ని రీమేక్‌లు వచ్చినా నీదే ఒరిజినల్‌’ అంటూ చేసిన ర్వీ టీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కైరా, షాహిద్‌ కలిసి ‘ఊర్వశి ఊర్వశి’ రీమిక్స్‌ పాటలో నర్తించిన విషయం విదితమే. ప్రస్తుతం రామ్‌చరణ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్న కైరా బాలీవుడ్‌లో ‘గుడ్‌ న్యూస్‌’, ‘కళంక్‌’ చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో మెరవబోతోంది.