హీరో కిరణ్ అబ్బవరం… అభినందనలు !

‘రాజావారు రాణిగారు’ తో వెండితెర ప్రవేశం చేసిన కిరణ్ అబ్బవరం ‘SR కళ్యాణమండపం’ తో ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి కూడా చాలా మంది నిర్మాతలు భయపడుతుంటే..ధైర్యంగా బరిలోకి దిగాడు కిరణ్ అబ్బవరం .’SR కళ్యాణమండపం’ సినిమా సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే. మంచి  కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్ గా ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. మూడు రోజుల్లోనే చాలా చోట్ల ఈ సినిమా సేఫ్ జోన్ కు రావడమే కాదు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది.

‘ఎస్ఆర్ కల్యాణమండపం’లో కిరణ్ అబ్బవరం పేరున్న హీరో కాదు. అయినా, ఈ మూవీ పేరు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ చిత్రంపై ఏర్పడ్డ అంచనాలే . ఆ మధ్య విడుదలైన టీజర్, ఇటీవల వచ్చిన ట్రైలర్ భారీ స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం యూత్ ఆసక్తిగా ఎదురు చూసింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంపై సినిమా వారు కూడా  దృష్టి సారించారు. ఈ సినిమా హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డారు. దీంతో అన్ని ఏరియాల హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడు పోయాయి. ఫలితంగా ‘ఎస్ఆర్ కల్యాణమండపం’  అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ.4.55 కోట్లు జరిగింది. దీని  బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.80 కోట్లు. నైజాం ఏరియాలో దాదాపుగా 200, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 200 థియేటర్లు, యూఎస్‌లో 30 లొకేషన్స్‌లో విడుదల అయింది.
‘ఎస్ఆర్ కల్యాణమండపం’. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విడుదలైనా దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది.  ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో షోలు నడవకున్నా.. తెలంగాణలో మాత్రం భారీగానే  సాధించింది. మంచి వసూళ్లు వచ్చాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ మూవీకి ఆశించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజుల్లోనే నైజాం సహా చాలా ఏరియాల్లో SR కళ్యాణమండపం సినిమా సేఫ్ జోన్ కు వచ్చేసింది. మరో మూడు నాలుగు రోజులు కానీ ఇదే జోరు చూపిస్తే చాలా పెద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి సెకండ్ వేవ్ తర్వాత మొదటి విజయంగా చరిత్ర సృష్టించింది SR కళ్యాణమండపం చిత్రం. అభినందనలు కిరణ్ అబ్బవరం !