ఆ ఘాటైన ముద్దు సీన్ చివరి నిమిషంలో తీసేసారు !

తెలుగుసినిమా ముద్దుల గురించి మాట్లాడితే మొద‌ట గుర్తుకొచ్చే సినిమా విజయ్ దేవరకొండ  ‘అర్జున్‌రెడ్డి’. అంత‌కుముందు చాలా సినిమాల్లోనూ ముద్దులున్నాయి కానీ, ‘అర్జున్‌రెడ్డి’లో ఉన్న‌న్ని ముద్దు సన్నివేశాలు మాత్రం వేరే చిత్రాల్లో లేవు. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’లో కూడా ఈ సన్నివేశాలు బాగానే చూపించారు.ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో ముద్దు స‌న్నివేశాలు కామ‌న్ అయిపోయాయి. యువతను థియేటర్స్ కి ర‌ప్పించాలంటే ఇవే కీల‌కమ‌నే విష‌యాన్నికనిపెట్టిన  ద‌ర్శ‌క‌నిర్మాత‌లు… ఏమాత్రం అవ‌కాశం ఉన్నా వాటిని సినిమాల్లో పెట్టేస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా విడుదలైన ‘గీత గోవిందం’లోనూ ఓ ముద్దు సన్నివేశాన్ని చేశారట. మూవీ రిలీజ్‌కి ముందే కొన్ని సన్నివేశాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. కాగా, లీకైన వెర్ష‌న్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య చివరలో వచ్చే ఆ ముద్దు సీన్ ఉంద‌ట‌. ఇదీ కానీ దాన్ని చివరి నిమిషంలో తొలిగించారని, దానికి కారణం హీరోయిన్ రష్మిక మందన అని తెలుస్తోంది.
 
‘అర్జున్‌రెడ్డి’ నుంచి యువతలో విజయ్ దేవరకొండపై ఏర్పడిన ‘ముద్దుల హీరో’ అనే అభిప్రాయం దృష్టిలో ఉంచుకుని…  ఆ విష‌యంలో డిజ‌ప్పాయింట్ చేయ‌కూడద‌నుకున్నారో ఏమో గానీ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా వచ్చిన ‘గీత గోవిందం’లోనూ ఓ ముద్దు సీన్ ప్లాన్ చేశారట. నిజానికి ఈ సినిమాకధ ముద్దు చుట్టూ తిరుగుతుంది. బ‌స్సులో ముద్దు గురించే గొడ‌వంతా. అయితే, సినిమా క్లైమాక్స్‌ లో వచ్చేలా చిత్ర యూనిట్ ఓ మంచి ముద్దు స‌న్నివేశం షూట్ చేశారని. అది చాలా ఘాటు ముద్దు సన్నివేశమని, హీరోహీరోయిన్ ఒక‌రిపై మ‌రొక‌రు కూర్చుని ముద్దు పెట్టుకుంటారని తెలిసింది. కానీ, సినిమాలో మాత్రం దాన్ని చూపించ‌లేదు. ఇద్ద‌రూ ముద్దు కోసం ద‌గ్గ‌ర‌వ‌డంతో టైటిల్ కార్డ్స్ ప‌డిపోయాయి.  కావాల‌నే ఆ ముద్దు సీన్ క‌ట్ చేశార‌ని సమాచారం. ఈ మూవీ విడుదలకు కొన్ని రోజుల ముందే “కధా నాయిక ర‌ష్మిక పెళ్లిపై ఈ ముద్దు స‌న్నివేశం ప్రభావం పడింద”ని పుకార్లు రావ‌డంతోనే కట్ చేశార‌ని అంటున్నారు . ర‌ష్మిక కోరిక మేరకే ఆ ముద్దుని అలా తీసేసారని తెలిసింది.