యువతకు స్పూర్తినిచ్చేలా కొత్త శ్రీనివాస్‌ ‘అష్టోత్తర శతం’

కొత్త శ్రీనివాస్‌… వెలువరించిన ‘అష్టోత్తర శతం’ పుస్తకం, కాలమానిని ని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఆవిష్కరించారు. ఆదివారం ఎర్రమంజిల్‌ మెర్క్యురీ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, సినీ దర్శకులు కోదండ రామిరెడ్డి, బి.గోపాల్‌, తెలంగాణ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ కె.విద్యాధర్‌, రచయిత కొత్త శ్రీనివాస్‌ శ్రీమతి ‘సమాజ సేవకురాలు’ కొత్త కృష్ణవేణి,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సానుకూల ఆలోచనా విధానంలో ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చంటూ.. యువతకు స్పూర్తినిచ్చేలా రచయిత కొత్త శ్రీనివాస్ ఈ అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చారని అతిధులు అన్నారు. తరాల కిందట పెద్దలు చెప్పిన సూక్తులను రచయిత శ్రీనివాస్‌ తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యేలా ప్రజల భాషలో వివరించారన్నారు.రాబోయే రోజుల్లో నాటకాలకు, పుస్తకాలకూ మంచి ప్రాధాన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రచయిత కొత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ…ఈ పుస్తకం వల్ల ఒక్కరు మారినా నా ప్రయత్నం సఫలీకృతమవుతుందన్నారు.