‘అకాశంలో ఆశల హరివిల్లు’ పాటలు విడుదల

సత్యశ్రీ, సుబ్బారెడ్డి, చరణ్, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య పాత్రల్లో క్రాంతి కిరణ్ దర్శకత్వంలో ఓం శక్తి ప్రొడక్షన్స్ పతాకం పై బి సత్య శ్రీ నిర్మిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’. శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నవ్యంద్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్ వి ఎన్ రావు, నిర్మాత సాయి వెంకట్ లు పాటల సీడిలను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా నవ్యంద్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్ వి ఎన్ రావు మాట్లాడుతూ .. అచ్చమైన తెలుగు టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ట్రయిలర్ బాగుంది. మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చాలా సినిమాలు నిరూపించాయి. అలాగే నిర్మాత సత్య శ్రీ అన్ని విషయాల్లో ముందుండి ఈ సినిమాను నడిపించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధించి ఈ యూనిట్ కు మంచి విజయాన్ని అందివ్వాలి అన్నారు. 
 
నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ .. మహానటి తరహాలో ఈ సినిమా నిర్మాత సత్య శ్రీ ముందుండి అన్ని పనులు చూసుకుంది. మహిళలు కూడా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణం. అలాగే చక్కని పేరుతొ వస్తున్నా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. హీరో హీరోయిన్లు చక్కగా ఉన్నారు. అలాగే మంచి టెక్నీకల్ టీమ్ కుదిరింది. ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కురొకుంటున్నాను అన్నారు. 
 
చిత్ర దర్శకుడు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ..  రెండో చిత్రం . మొదటి సినిమాకూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సత్య శ్రీ గారికి ధన్యవాదాలు, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు. 
 
హీరో , హీరోయిన్లు మాట్లాడుతూ .. ఈ సినిమాతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపారు. నిర్మాత సత్య శ్రీ మాట్లాడుతూ .. దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరో  హీరోయిన్లు ఈ నలుగురి సపోర్ట్ వల్లే ఈ సినిమాను తీయగలిగాను. వారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు అన్నారు. 
 
ఈ చిత్రానికి ఎడిటింగ్ : సన్ సోర్స్ డిసైన్ , సంగీతం : శ్రీనివాస్ మాలపాటి , కెమెరా : రెమో జి ఆశిష్ కథ , నిర్మాత : సత్య శ్రీ, స్క్రీన్ ప్లే – దర్శకత్వం : క్రాంతి కిరణ్ .