బి.గోపాల్ క్లాప్ తో సాయివిలా సినిమాస్ చిత్రం ప్రారంభం !

రావుల గౌరమ్మ  సమర్పణలో సాయి విలా సినిమాస్  పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత  జంటగా  అంజన్ చెరుకూరి  దర్శకత్వంలో  నిర్మిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరుపుకుంది. ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ , రేలంగి నరసింహారావు , గౌతం రాజు, ప్రసన్న కుమార్ , రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం కృష్ణ, సుమీత  హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి  దర్శకుడు బి. గోపాల్ గారు  క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు రేలంగి నరసింహారావు గారు గౌరవ దర్శకత్వం వహించారు.

చిత్ర దర్శకుడు అంజన్ చెరుకూరి మాట్లాడుతూ..  అశల పల్లకిలో అందరూ ఊగుతూ ఉంటారు.కానీ ఆ ఆశలు తీర్చుకొని ఎలా కోటీశ్వరులు అయ్యారు అనేదే ఈ సినిమా కథ.  నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు వారికి.ధన్యవాదాలు. నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో తెరకేక్కించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

చిత్ర నిర్మాతలు లక్ష్మణ్  రావు., శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. మా మొదటి సినిమా రుద్రవీణ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో మా రెండవ  ప్రాజెక్టు గా  ఈ సినిమా తీస్తున్నాము. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాము మంచి కథతో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ మెప్పు పొందేలా ఉంటుంది అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ.. నా ఐదవ సినిమాకు బి. గోపాల్, రేలంగి నరసింహరవు గారి వంటి లెజెండ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర నిర్మాతలు నన్ను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయడానికి  ముందుకు వచ్చారు. వారు మా పై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామని  తెలుపుకుంటున్నాను అన్నారు

కమెడియన్ గౌతం రాజు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మా అబ్బాయి సినిమా ప్రారంభం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత లక్ష్మణ్ డేరింగ్ పర్సన్. తన మెదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా మొదలుపెట్టాడు. దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటీ నటులు
కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత  తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : రావుల గౌరమ్మ, బ్యానర్: సాయి విలా
నిర్మాతలు : రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను
స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అంజన్ చెరుకూరి
DOP: ఎస్. రాజశేఖర్, సంగీతం: త్రినాథ్ మంతెన