కృష్ణసాయి రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సుందరాంగుడు’

లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సుందరాంగుడు’. ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినయ్‌బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె. రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సీనియర్‌ ఫోటో జర్నలిస్ట్‌ సాయి రమేష్‌ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ ట్రైలర్‌ లాంచ్‌ జరుపుకుంది.

కృష్ణసాయి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణసాయి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల విషయంలో ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటోంది.  ఈ సినిమా విడుదల విషయంలో పెద్దలు మంచి మనసు చేసుకుని విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు .
కృష్ణసాయి మాట్లాడుతూ… ఈ సినిమా లో  7 పాటలు ఉన్నాయి. అందులో ఒక డీజే సాంగ్‌ ఉంది. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు ‘సుందరాంగుడు’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా వస్తున్న మా సినిమా విడుదలకు సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను. ఎంతో మంది నిర్మాతలు సినిమా రిలీజ్‌ విడుదల చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను..అని అన్నారు.
మ్యూజిక్‌: సిద్ధబాబు,కె మెరా: వెంకట్‌ హనుమాన్‌, డ్యాన్స్‌: నిక్సన్‌, పాల్‌, సూర్య కిరణ్‌, అనిష్‌, రవికృష్ణ, ఫైట్స్‌: రామ్‌ సుంకర-అశోక్‌రాజ్‌