నరసింహ రెడ్డి ‘ఏజెంట్ నరసింహ -117’ ట్రైలర్ రిలీజ్ 

‘ఏజెంట్ నరసింహ-117’ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అతిధులుగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాస్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ హాజరై ట్రైలర్ ను విడుదల చేశారు. నవ్యసాయి ఫిలిమ్స్ పతాకం పై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి కృష్ణ, నిఖిత, మధుబాల హీరో హీరోయిన్లుగా షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవగిల్, నరసింహ కీలక పాత్రల్లో నటించారు.
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ…  ఏజెంట్ నరసింహ -117 సినిమా కు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ చాప్రాల ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ గా లక్ష్మణ్ పని చేశారని చెప్పారు. పక్క మాస్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ కావాలని , దర్శకుడు లక్ష్మణ్ కు మంచి పేరు తీసుకురావాలని, నిర్మాత నర్సింహా రెడ్డికి డబ్బులు తెచ్చి పెట్టాలని అన్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ...ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు రిధం స్టూడియో లోనే నిర్వహించారని చెప్పారు. ఏజెంట్ నరసింహ -117 విడుదలకు ఫిలిం ఛాంబర్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… చిన్న సినిమాల విడుదలకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటుందని అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్  ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ.. చిన్న సినిమా ఏజెంట్ నర్సింహా-117  విడుదల కోసం తాను ఎలాంటి సహాయం చెయ్యడానికి ముందు వరుసలో ఉంటానని అన్నారు.
నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… నిర్మాత నరసింహ రెడ్డి సినిమా జీవితం రామకృష్ణ స్టూడియో లో ప్రారంభమైందని అన్నారు. స్వర్గీయ ఎన్ టి ఆర్ గారి అనేక సినిమాలకు నరసింహ రెడ్డి పని చేశారని చెప్పారు.
ఏజెంట్ నరసింహ -117 నిర్మాత బి. నరసింహ రెడ్డి మాట్లాడుతూ… ఈ సినిమాలో  ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో ఈ సినిమాను రిలీజ్ చెయయడానికి ప్లాన్ చేస్తున్నామని  ఆయన అన్నారు.
దర్శకుడు లక్ష్మణ్ చప్రాల మాట్లాడుతూ.. ఎంతో కస్టపడి తీసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు వచ్చిన అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కెమెరామెన్ జయరాం కరోనాతో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. జయరాం కు రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ చిత్రానికి  సంగీతం – రాజ్ కిరణ్ , కెమెరా – స్వర్గీయ జయరాం (పెళ్లి సందడి ఫెమ్).