“అజ్ఞాత‌వాసి” కాపీ వివాదం…ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడి ఆసక్తి !

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ లు తాజాగా ‘అజ్ఞాత‌వాసి’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావడానికి సిద్ధ‌మ‌య్యారు. ‘జ‌ల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి రెండు వరస హిట్ చిత్రాలను అందించిన వీళ్ల జోడి….మూడో సారి జతకట్టింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న  ప్రేక్షకుల ముందుకు రానుంది, ఇప్ప‌టికే మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా  జ‌రుగుతున్నాయి. కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు విదేశాల‌లోను ఈ మూవీపై చాలా ఆస‌క్తి నెల‌కొంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘కొడ‌కా’ సాంగ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని చిత్ర యూనిట్ కొండంత ఆశలు పెట్టుకుంది.

ఇలాంటి సందర్భంలో ‘అజ్ఞాత‌వాసి’ చిత్రం ఫ్రెంచి సినిమా ”లార్గోవించ్‌” కాపీ అని జోరుగా ప్ర‌చారం కొనసాగుతుంది. దీంతో ఈ వార్త ఫ్రెంచి డైరెక్ట‌ర్‌కి కూడా తెలిసి, వెంటనే త‌న ట్విట్ట‌ర్ ద్వారా లార్గోవించ్ చిత్ర‌ దర్శకుడు జెరొమ్ సల్లే త‌న ట్విట్ట‌ర్ ద్వారా కామెంట్ తో కౌంటర్ ఇచ్చాడు. ఓ తెలుగు సినిమా త‌న సినిమాని కాపీ చేయ‌డంపై కాస్త ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే త‌న అభిప్రాయాన్ని జెరొమ్‌ వ్యక్తపరిచారు. ‘అజ్ఞాత‌వాసి టికెట్ కొనాలని అనుకుంటున్నాను..చాలా క్యూరియస్ గా ఉన్నాను’ అని ట్వీట్ చేశాడు.

‘లార్గోవించ్’ సినిమా రీమేక్ రైట్స్ ను ‘టీ’ సీరిస్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తుండ‌గా,’అజ్ఞాత‌వాసి’ చిత్రం ఫ్రెంచ్‌ థ్రిల్లర్‌ ‘లార్గో వించ్‌’ చిత్రాన్ని పోలి ఉందని టీ-సిరీస్‌ సంస్థ ‘అజ్ఞాతవాసి’ చిత్రబృందానికి లీగల్‌ నోటీసులు పంపించిందట. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ‘లార్గో వించ్‌’ను పోలి ఉందనే వార్తలు రావడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాపీరైట్స్‌కు సంబంధించిన సమస్య కారణంగా టీ- సిరీస్‌ కోర్టుకు వెళ్ళిందట. అజ్ఞాత‌వాసి చిత్రం నిజంగానే ఫ్రెంచి సినిమాకి కాపీ అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ కి ” కొడకా కోటేశ్వరరావు తిప్పలు తప్పవు రో “…..