మేకప్ వేసి వేసి విసుగొచ్చేసిందట !

సినిమా, మోడలింగ్ రంగాల్లోని భామలు కెమెరా ముందుకు రావాలంటే మేకప్ తప్పనిసరి. మేకప్ చెరిగిపోతే తమ అందం తరిగిపోతుందేమోనని భయపడుతుంటారు కొంతమంది హీరోయిన్స్.

ఆకర్షణీయంగా కనపడాలంటే ఎంతటి అందగత్తెకయినా ముఖానికి మెరుపులు తప్పవు. అందానికి మెరుగులు తప్పవు.అయితే దీనికి భిన్నంగా ఆలోచిస్తోంది శంకర్  ‘ఐ,’2.0’ చిత్రాల అందాల నాయిక అమీ జాక్సన్.ఈ లండన్ భామకి ఇప్పుడు మేకప్ మీద విరక్తి పుట్టిందట. డీ గ్లామర్ రోల్స్ చేయాలని ఉందంటోంది.
 అమీ జాక్సన్ బికినీలు ధరించడంలో బ్యాచ్‎లర్ డిగ్రీ, స్కిన్ షో చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసింది. అలాంటి హాట్ భామకి మేకప్ వేసి వేసి  విసుగొచ్చేసిందట. ఈ విషయాన్ని ఓ స్కిన్ కేర్ అప్లికేషన్ లాంఛ్ చేస్తూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ అప్లికేషన్ తనకు బాగా ఉపయోగపడుతోందని చెప్పిన అమీ.. ఫేస్ మేకప్ కోసం ఉపయోగించే క్రీమ్స్‎లో ఉండే కెమికల్స్ గురించి రీసెంట్ గానే తెలుసుకుందట. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నానంటోంది అమీ జాక్సన్.
 ఇకపై సినిమాల్లో వీలైనంత తక్కువ మేకప్ కలిగిన పాత్రలు ధరిస్తానని చెబుతోంది అందాల అమీ. ఇది వింటున్న వారు ఆల్ట్రా మోడ్రన్ గ్లామర్‎ను పంచే ఈ భామతో ఏరికోరి ఏ దర్శకుడు డీ గ్లామర్ రోల్స్ చేయించే ధైర్యం చేస్తాడంటున్నారు. అలాగే అందాల ఆరబోతకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించే అమీ జాక్సన్‎ను మేకప్ లేకుండా ఎవరు చూస్తారని ఒకటే కామెంట్స్  చేస్తున్నారు