లైకా ప్రొడ‌క్ష‌న్స్ చేతికి అరుణ్ విజ‌య్ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’

లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌. సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ  రాణిస్తోంది. అంద‌రి ఆద‌రాభిమానాల‌ను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వ‌న్, ఇండియన్ 2 వంటి చిత్రాలు స‌హా ఎన్నో భారీ చిత్రాల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్  నిర్మాణాలే అనే సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ తాజాగా లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌క్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది. ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు.
లైకా సంస్థ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల‌ చేయ‌టానికి సిద్ధ‌మైంది.

విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను చేసే  ద‌ర్శ‌కుడు విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం.

2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ఈ చిత్రంతో మళ్ళీ సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నున్నారు. మ‌ల‌యాళ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు. ఈ సినిమా కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖ‌ర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమాలో చిత్రీక‌రించిన నైట్ షాట్స్‌, డ్రామా ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌త‌కు లోను చేస్తుంది.