అదే ఈ రోజు మీ అభిమానానికి కారణం !

మాధురీ దీక్షిత్‌… ‘హార్డ్‌ వర్క్‌కి ప్రత్యామ్నాయం లేదు. విజయంలో నిత్య శ్రమే ప్రధాన భూమిక పోషిస్తుంది’ అని మాధురీ దీక్షిత్‌ అన్నారు. బాలీవుడ్‌లో అనేక అద్భుత కళాఖండాల్లాంటి చిత్రాల్లో నటించి అలరించారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత. నటిగా, తల్లిగా, భార్యగా ఇలా విభిన్న కోణాలను ఆవిష్కరించారు. అద్భుత నటిగా ఇండియన్‌ ఆడియెన్స్‌ని ఫిదా చేశారు.

ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె హార్డ్‌ వర్క్‌ గురించి ఓ షోలో మాట్లాడుతూ… ‘నా కెరీర్‌లో పలు అద్భుతమైన పాటల్లో నటించే అవకాశం లభించింది. అమేజింగ్‌ కొరియోగ్రాఫర్లు పలు మెమరబుల్‌ సాంగ్స్‌ని క్రియేట్‌ చేశారు. ఆయా పాటలను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నా. అయితే సక్సెస్‌కి ప్రధాన కారణం హార్డ్‌ వర్క్‌. దానికి ప్రత్యామ్నాయం లేదు. రెండు శాతం తెలివి ఉంటే, 98 శాతం హార్డ్‌ వర్క్‌ కావాలి. నేను నటించిన ప్రతి పాత్రలో నా వరకు నేను బెస్ట్‌ ఇచ్చా. అది యాక్టర్‌గానే కాదు, డాన్సర్‌గా, తల్లిగా, వైఫ్‌గా కూడా. నేను మంచి డాన్సర్‌గా ఎదగడానికి రోజూ చేసే ప్రాక్టీసే కారణం. అదే ఈ రోజు మీ అభిమానం పొందటానికి కారణం అయ్యింది’ అని తెలిపింది.

ప్రస్తుతం ఆమె ‘టోటల్‌ దమాల్‌’, ‘కళంక్‌’ చిత్రాల్లో నటిస్తోంది.