టాప్ 10 చిత్రాల్లో 4వ స్థానంలో ‘మహానటి’

#Mahanati gets placed at fourth position in @IMDb’s list of top 10 Indian Movies for the year 2018
 @KeerthyOfficial @Samanthaprabhu2 @TheDeverakonda @dulQuer @VyjayanthiFilms @SwapnaDuttCh @SwapnaCinema @mickeyjmeyer
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మహానటి’. లెజెండరీ నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు.. అంతటి ఉన్నత స్థితిలో బతికిన సావిత్రి చివరకు ఎంత దీన స్థితికి చేరుకుందనేది చూసిన ప్రేక్షకులు చలించిపోయారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.
సినిమా చూసిన వారెవ్వరూ కామెంట్ చేయడానికి వీల్లేకుండా కథనాన్ని నాగ్ అశ్విన్ మలిచిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆది నుంచి ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు అందుకుంటూనే ఉంది. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన టాప్ 10 చిత్రాల్లో 4వ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత తదితరులు కీలక పాత్ర పోషించారు.