‘భూం.. భూం..’ ఓ పాప్ హిట్ ఇన్స్పిరేషన్ !

మహేష్ బాబు, ఏఆర్‌ మురుగదాస్‌ల మోస్ట్ వెయిటింగ్ ప్రాజెక్టు ‘స్పైడర్’. ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో ఈ సినిమా నుంచి హీరో ఇంట్రో సాంగ్ ను ‘భూం.. భూం..’ పాటను  చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట విషయానికొస్తే హీరో క్వాలిటీస్‌ను పొగుడుతూ  రామజోగయ్య శాస్త్రి అందించిన మంచి సాహిత్యంతో సింగర్ నిఖిత గాంధీ చాలా బాగా పాడింది.  ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ కంపోజ్ చేశారు. మహేష్ అభిమానులకు  ఈ పాట బాగా నచ్చడంతో లూప్ మోడ్‌లో వింటున్నారు.

ఇప్పటివరకు బాగానే ఉన్నా ఈ పాటపై భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ పాటను బాగా విని గమనించిన సంగీత ప్రియులు మాత్రం..ఇది ఓ పాప్ హిట్ ఆల్బమ్ Fifth Harmony’s Baby I’m Worth నుండి స్ఫూర్తి పొందినట్టుగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ టాలీవుడ్ టౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ‘స్పైడర్’ టీం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. మహేష్ బాబు డబ్బింగ్ పనుల్లోను.. ఏఆర్‌ మురుగదాస్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి సారించి బెస్ట్ అవుట్ ఫుట్ కోసం శ్రమిస్తున్నారు. ఇక టీజర్ ను కూడా ఆగష్టు 9న రిలీజ్ చేసి, సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.