రిచ్‌ కంటెంట్‌ తో జెన్యూన్‌ ఫిల్మ్‌ ‘మహర్షి’

‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌, పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌తో ఇంటర్వ్యూ….
మూడు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ లో మీకు నచ్చిన క్యారెక్టర్‌ ఏది?
– నన్ను అడిగితే మూడు చాలా బాగా నచ్చాయి. కానీ నా ఫేవరేట్‌ అంటే కాలేజ్‌ ఎపిసోడ్‌. ఎందుకంటే నేను కథ విన్నప్పుడే చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. వంశీతో కూడా చెప్పాను. కాలేజ్‌ ఎపిసోడ్‌ చాలా ఇంపార్టెంట్‌, చాలా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్‌గా తీయాలని. ఎందుకంటే కెరీర్‌ టు డికేడ్స్‌ అయిపోయింది. 25వ సినిమాకి వచ్చాము. కాలేజ్‌ ఎపిసోడ్‌ ప్రాపర్‌గా 45 మినిట్స్‌ ఉంటుంది. దాన్ని కన్విన్సింగ్‌గా తీయగలిగితే మనం అఛీవ్‌ చేసినట్లే అని చెప్పాను. అందుకని అది నా ఫేవరేట్‌ బ్లాక్‌. ఇప్పుడు ఆ బ్లాక్‌ని సినిమాలో చూస్తున్నప్పుడు చాలా గర్వంగా అన్పించింది. ఆడియన్స్‌ కూడా ఆ బ్లాక్‌కి సర్‌ప్రైజ్‌ ఫీల్‌ అవుతారు.
‘మహర్షి’ సినిమాలో మీకు ఇన్నోవేటివ్‌గా అనిపించిన పాయింట్‌ ఏది?
– అది కథే అండి. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పినట్లుగా కథ ఒక 20 నిమిషాలు విందామనుకున్నాను. కానీ ఆయన నేరేట్‌ చేసిన విధానం నన్ను నిజంగా సర్‌ప్రైజ్‌ చేసింది. అప్పుడు వంశీతో చెప్పాను. ఇప్పుడు నాకు రెండు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. వాటి తర్వాత చేద్దాం అని. దానికి ఆయన ‘నో ప్రాబ్లెమ్‌ సార్‌! వెయిట్‌ చేస్తాను. ఎందుకంటే మీరు తప్ప ‘మహర్షి’ ఇంకెవరూ చేయలేరు. మీరే కనిపిస్తున్నారు’ అన్నారు. ఆయన కన్విక్షన్‌కి హ్యాట్సాఫ్‌.
ఈ కథ 25వ సినిమాగా చేద్దామని ముందే అనుకున్నారా?
– అనుకోకుండా వచ్చింది. వంశీ కథ చెప్పడం. తర్వాత నా రెండు సినిమాలు రావడం. వంశీ వెయిట్‌ చేయడం. ఇది 25వ సినిమాగా చేద్దామని మేం ప్లాన్‌ చేయలా. అలా జరిగింది.
రిషి క్యారెక్టర్‌ డిజైన్‌ చేసిన విధానం గురించి చెప్పండి?
– నా ఎంటైర్‌ కెరీర్‌లో అంత డెప్త్‌గా ఉన్న క్యారెక్టర్‌ నేను వినలేదు. అంత డెప్త్‌ ఉంది ‘మహర్షి’లో. కంటెంట్‌పరంగా రిచ్‌గా ఉంటూ ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ కూడా చూసి ఉండరు. ఒక జెన్యూన్‌ ఫిల్మ్‌. అన్నీ ఎమోషన్స్‌, క్లాస్‌, మాస్‌, యూత్‌, ఫ్యామిలీ, ఇలా అన్నీ యాంగిల్స్‌ కవర్‌ చేస్తూ ఒక హీరో ఫ్యాన్స్‌ని ఎలా ఎగ్జయిట్‌ చెయ్యాలో.. అలా డిజైన్‌ చేశారు వంశీ.
ఈమధ్య రీ-ఫామింగ్‌ కాన్సెప్ట్‌ మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు?
– అదేం కాదండీ. ఇంతకు ముందు నా సినిమాలో కూడా పవర్‌ఫుల్‌, సోషల్‌ మెసేజ్‌ ఇవ్వడం జరిగింది. నా కోసం అలాంటి క్యారెక్టర్స్‌ డిజైన్‌ చేసిన డైరెక్టర్లకు రుణపడి ఉంటాను. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ లాంటి పవర్‌ఫుల్‌ మెసేజెస్‌ ఉన్న సినిమాల్లో నేను భాగమైనందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అలాగే ‘మహర్షి’లో కూడా వెరీ పవర్‌ఫుల్‌ పాయింట్‌ని టచ్‌ చేశాం.
‘శ్రీమంతుడు’లో విలేజ్‌ని దత్తత తీసుకోవడంలా ఈ సినిమాలో కూడా ఉంటుందా?
– ఈ సినిమాలో కూడా విలేజ్‌ని దత్తత తీసుకోవడం కంటే కూడా పవర్‌ఫుల్‌ పాయింట్‌ ఉంటుంది. దాని గురించి మాట్లాడను. అది మే 9న అందరూ దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు.
మీరు ఇంతవరకూ చేయని రైతు క్యారెక్టర్‌ చేయడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?
– ఈ సినిమాలో మూడు గెటప్స్‌ లాక్‌ చేసినప్పుడు ఆ క్యారెక్టర్‌ కూడా అందులో ఒకటి. వంశీ ఆ క్యారెక్టర్‌ పట్ల చాలా క్లియర్‌గా ఉన్నారు. స్టూడెంట్‌కి ఒక లుక్‌, కంపెనీ సిఇఓగా ఒక లుక్‌, అలాగే ఊరికి వచ్చినప్పుడు మరో లుక్‌ చాలా అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఏ లుక్‌ అయినా క్యారెక్టర్‌ ప్రకారంగా ఉంటుంది.
సక్సెస్‌ కోసం పోరాడే క్యారెక్టర్‌ చేయడం ఎలా అన్పించింది?
– బేసిగ్గా నేను ‘మహర్షి’ కథ విన్నప్పుడు నా ఒక్కడికే కాదు.. మనందరికీ కూడా ఎక్కడో ఓ చోట రిలేట్‌ అవుతుంది. ఒక ఎమోషనల్‌ స్క్రిప్ట్‌కి ఉన్న బ్యూటీ అది. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లో జరిగిందే అని ఫీలవుతారు. అది నేనూ ఫీలయ్యాను. ఆడియన్స్‌ కూడా ఫీలవుతారు.
 మూడు బేనర్స్‌లో, మల్టీస్టారర్‌ ప్రొడ్యూసర్స్‌తో చేయడం ఎలా అన్పించింది?
– ముందుగా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్‌. ‘మహర్షి’ అనేది చాలా పెద్ద మ్యాగ్నిట్యూడ్‌ ఉన్న ట్రెమండస్‌ ప్రాజెక్ట్‌. ముగ్గురు ప్రొడ్యూసర్స్‌ చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. మూడు కూడా ప్రెస్టీజియస్‌ బేనర్‌లే.
సంవత్సరానికి మీ నుండి రెండు సినిమాలు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యొచ్చా?
– ‘భరత్‌ అనే నేను’ సినిమా తర్వాత ఒన్‌మంత్‌ గ్యాప్‌ మాత్రమే తీసుకున్నాను. ఈరోజుల్లో సినిమా అనేది చాలా టఫ్‌ టాస్క్‌ అయిపోయింది. నాన్నగారు, వాళ్లందరూ 350, 400 సినిమాలకి హీరోలుగా చేశారు. అయితే ఇప్పుడు 25 సినిమాకే ల్యాండ్‌మార్క్‌ సినిమా అంటున్నారు. ఒక పెద్ద సినిమా చేయాలంటే మినిమం 8 నుండి 10 నెలలు టైమ్‌ పడుతుంది. ఒక పర్‌ఫెక్ట్‌ ప్రొడక్ట్‌ ఇవ్వాలంటే ఆ టైమ్‌ అనేది కంపల్సరీ.
టెక్నాలజీ పెరిగింది కదా! అంత టైమ్‌ ఎందుకు పడుతుంది?
– టెక్నాలజీ పెరిగింది కాబట్టే అంత టైమ్‌ తీసుకోవాల్సి వస్తుంది.
ఈ సినిమాలో మీరు ఛాలెంజింగ్‌గా తీసుకొని చేసిన ఎపిసోడ్‌ ఏది?
– ఇంతకుముందే చెప్పినట్టు కాలేజ్‌ ఎపిసోడ్‌. ఫస్ట్‌ షెడ్యూల్‌ డెహ్రాడూన్‌లో చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్‌ని కన్విక్షన్‌గా మనం చెప్పగలిగితే మనం ఎఛీవ్‌ చేసినట్లే అని వంశీకి చెప్పాను. ఈరోజు దాన్ని ఎఛీవ్‌ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
వంశీ మేకింగ్‌ స్టైల్‌ గురించి?
– ముందు నుంచీ వంశీ చాలా క్లారిటీగా ఉన్నాడు. కథని ఎలా చెప్పాడో అలానే తీశారు. తన క్లారిటీని డైరెక్ట్‌గా కన్వే చేస్తారు. సినిమా చూశాక ముందు వంశీకి మంచి కాంప్లిమెంట్స్‌ ఇస్తారు. సినిమాని అంత ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. ఆయన టీమ్‌ కూడా స్క్రిప్ట్‌ మీద చాలా బాగా వర్క్‌ చేశారు.
ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో కొంతమంది డైరెక్టర్ల పేర్లు ప్రస్తావించకపోవడం గురించి?
– ఆరోజు ఏమైందంటే.. యూరప్‌ నుంచి ఫ్లైట్‌లో 16 గంటలు జర్నీ చేసి స్టేజి మీదకి వచ్చాం. అప్పటికే స్టేజ్‌ పైకి కొంతమంది ఫ్యాన్స్‌ వచ్చారు. ‘పోకిరి’ అనేది నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. పూరి జగన్నాథ్‌ పేరు ప్రస్తావించకపోవడం ఇట్‌ వాజ్‌ ఎ మిస్టేక్‌. పూరి జగన్నాథ్‌గారికి ధన్యవాదాలు. అలాగే సుకుమార్‌గారు ‘1’ (నేనొక్కడినే) అనేది నా కెరీర్‌లో కల్ట్‌ ఫిల్మ్‌. అలాగే నా కుమారుడు గౌతమ్‌తో కలిసి నటించే అవకాశం కూడా లభించింది. సుకుమార్‌గారు ఒన్‌ ఆఫ్‌ మై ఫేవరేట్‌ డైరెక్టర్‌. అప్పుడు నేను స్టేజిమీద వంశీ ఈ సినిమా కోసం రెండేళ్లు వెయిట్‌ చేశారు. ఈరోజుల్లో టు మంత్స్‌ కూడా ఎవరూ వెయిట్‌ చెయ్యరు అన్నాను. అది నేను వంశీని పొగిడాను తప్ప సుకుమార్‌గారిని పాయింట్‌ అవుట్‌ చేసి అన్నది కాదు. కొంతమంది దాని గురించి నెగిటివ్‌గా న్యూస్‌లు కూడా రాశారు. సుకుమార్‌గారు నాకు వెరీ స్పెషల్‌ డైరెక్టర్‌తో పాటు మంచి ఫ్రెండ్‌ కూడా. ఫ్యూచర్‌లో మేమిద్దరం కలిసి వర్క్‌ చేస్తాం. ఆ విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ అవసరం లేదు.
మీ జర్నీని సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ ఆధారంగా చెప్పారా?
– సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అని కాదండీ. నా కెరీర్‌ గ్రాఫ్‌లో వెరీ ఇంపార్టెంట్‌ ఫిలింస్‌ గురించి చెప్పాను. ‘మురారి’ సినిమా మహేష్‌ యాక్ట్‌ చేయగలడు అని చెప్పిన క్రూషియల్‌ సినిమా. తర్వాత ‘ఒక్కడు’ నన్ను స్టార్‌ని చేసింది. ‘అతడు’ సినిమా నాకు యు.ఎస్‌. మార్కెట్‌ని ఓపెన్‌ చేసింది. ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. అలా నా జర్నీలో ఇంపార్టెంట్‌ సినిమాలు గురించి ప్రస్తావించానే గానీ.. హిట్‌ అయిన డైరెక్టర్స్‌కే థాంక్స్‌ చెప్పాను అని కాదు.
ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో దిల్‌రాజు క్లైమాక్స్‌ హైలెట్‌ అని చెప్పారు కదా?
– కథ వింటున్నప్పుడు, డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. క్లైమాక్స్‌ సినిమాకి చాలా కీలకం. క్లైమాక్స్‌ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను.
అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌ గురించి?
– సినిమాలో అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌ చాలా ఇంపార్టెంట్‌. కథ చెబుతున్నప్పుడు వంశీ కూడా అల్లరి నరేష్‌ అని పేరు చెప్పే కథ చెప్పారు. అలాగే ఆయన కూడా కథ వినగానే వెంటనే ఓకే చెప్పారు. ఈ సందర్భంగా నరేష్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ కెరీర్‌లో మోస్ట్‌ మెమొరబుల్‌ మూమెంట్స్‌ గురించి?
– నా సినిమాలు ఎప్పుడూ నాన్నగారితో కలిసి సుదర్శన్‌ 35 థియేటర్లో మార్నింగ్‌ షోలు చూసేవాడ్ని. ‘మురారి’ సినిమా క్లైమాక్స్‌ అయిపోయాక నాన్నగారు ఏమీ మాట్లాడకుండా నా భుజం మీద చెయ్యి పెట్టారు. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మే 9న మూడు బేనర్స్‌కి సూపర్‌హిట్స్‌ ఉన్నాయి కదా?
– మే 9 అనేది ఒక మ్యాజికల్‌ డేట్‌. ఆరోజున అందరికీ చాలా సూపర్‌హిట్స్‌ ఉన్నాయి. ‘మహర్షి’తో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ కొట్టబోతున్నాం. మా ఫ్యాన్స్‌ కూడా ఇప్పటి నుండి మీ సినిమాలు మేలోనే రిలీజ్‌ చేయండి అనేలా ఉంటుంది.
ఎఎంబి మాల్‌ ఐకానిక్‌ ప్లేస్‌లాగా మారింది కదా! దాని గురించి?
– ఇది మా అందరి కల. 6 సంవత్సరాల డ్రీమ్‌. ‘1’ నేనొక్కడినే సినిమా చేస్తున్నప్పుడు ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌గారు, ఆయన ఫాదర్‌తో డిస్కస్‌ చేయడం జరిగింది. నా డ్రీమ్‌ ఏంటంటే చేస్తే.. ఇండియాస్‌ బెస్ట్‌గా ఉండాలి. గ్రేట్‌ సౌండ్‌. లేటెస్ట్‌ ప్రొజెక్టర్స్‌. అన్నీ హంగులతో ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లా ఉండాలి. ఈ రోజు నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు పెరగడంతో పాటు చాలామంది సెలబ్రిటీస్‌ వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ఐ యామ్‌ వెరీ హ్యాపి.
మీ థియేటర్లో మీరు సినిమా చూశారా?
– చూడలేదు. రేపో, ఎల్లుండో ‘అవెంజెర్స్‌’ సినిమా చూద్దామనుకున్నాను. 7 గంటల షోకి టిక్కెట్స్‌ అడిగితే లేవన్నారు. (నవ్వుతూ).
కమర్షియల్‌ యాడ్స్‌ చేయడానికి మీ ప్రయారిటీ?
– ప్రయారిటీ అంటే బ్రాండ్‌ వేల్యూస్‌ చూస్తాను. దానికి సంబంధించిన అన్ని విషయాలు నమ్రత చూసుకుంటుంది. ఎంటైర్‌ టీమ్‌ వర్క్‌ ఉంటుంది.
దేవి మ్యూజిక్‌ గురించి?
– దేవి నా ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. మొదటి మూడు సాంగ్స్‌ స్టోరి రిలేటెడ్‌. సినిమా రిలీజయ్యాక వాటి ఇంపాక్ట్‌ ఏమిటో తెలుస్తుంది. కథలో మిళితమయ్యే సాంగ్స్‌ కంపోజ్‌ చేయడం చాలా డిఫికల్ట్‌ టాస్క్‌. ఆ విషయంలో దేవి మాస్టర్‌. సినిమా రిలీజ్‌ అయ్యాక ‘మహర్షి’ సినిమాలోని ప్రతి పాట సూపర్‌హిట్‌ అవుతుంది.అలాగే అద్భుతమైన లిరిక్స్‌ రాసిన శ్రీమణికి కృతజ్ఞతలు.
పూజా హెగ్డే పెర్‌ఫార్మెన్స్‌ గురించి?
– పూజ వెరీ గుడ్‌ లుకింగ్‌. మా సినిమాలో చాలా అందంగా ఉంది. ఆమె క్యారెక్టర్‌ను వంశీ క్రియేట్‌ చేసిన విధానం, ప్రెజెంట్‌ చేసిన తీరు చాలా బాగుంది. ఫ్యాన్స్‌ అందరూ ఆమెతో ప్రేమలో పడతారు.
మీ ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు?
– గత 20 సంవత్సరాలుగా 25 సినిమాలకు వాళ్లు చూపించిన ప్రేమ చాలా చాలా గొప్పది. వాళ్ళు లేకపోతే నేను లేను. మరో 20 సంవత్సరాలు 25 సినిమాలకు కూడా వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
అనీల్‌ రావిపూడితో సినిమా చేయడం మీ ఛాయిసా? లేక ఫ్యాన్స్‌దా?
– నా ఛాయిస్‌ అండి. నా కంఫర్ట్‌ జోన్‌లో ఉంటూ ఇంకా ఫ్రెష్‌గా ఏదో చెయ్యాలనిపిస్తుంది. అందుకే ఆ స్క్రిప్ట్‌ సెలెక్ట్‌ చేశాను. బిగ్‌ ప్రాజెక్ట్‌. అలాంటి ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ రోల్‌ చేసి చాలా రోజులైంది. చాలా క్రూషియల్‌ సబ్జెక్ట్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉంటుంది. జూన్‌ ఎండ్‌ నుండి సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అవుతుంది.
రాజమౌళి, త్రివిక్రమ్‌లతో సినిమా ఎప్పుడు?
– రాజమౌళి ఇండియాస్‌ నెంబర్‌వన్‌ డైరెక్టర్‌. ఆయన సినిమా అంటే అన్నీ లాంగ్వేజెస్‌లో అభిమానులున్నారు. ఆయనతో డిస్కషన్‌ పూర్తయింది. ఆయన కమిట్మెంట్స్‌, నా కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాక కె.ఎల్‌. నారాయణ నిర్మాతగా సినిమా ఉంటుంది. అలాగే త్రివిక్రమ్‌గారితో కూడా సబ్జెక్ట్‌ డిస్కషన్‌ జరిగింది. అది కూడా పూర్తి పాజిటివ్‌గా ఉంది.