ఇద్దరు మహేష్‌లను ఒకే తెరపై చూస్తారా?

వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మహర్షి’ అనే టైటిల్‌ను ఇటీవలే మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. ఓ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. తాజా సమాచారం మేరకు ఇందులో మహేష్‌ ‘రిషి’, ‘మహర్షి’గా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.
తెరపై ఒక్క మహేష్‌బాబును చూస్తేనే అభిమానులు ఊగిపోతారు. అలాంటిది ఒకేలా ఉన్న ఇద్దరు మహేష్‌లను ఒకేసారి తెరపై చూస్తే.. అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా పండగే. తొలిసారి మహేష్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే ఆసక్తికర వార్త ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో తండ్రీ తనయులుగా మహేష్‌బాబు కనిపించే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా ‘స్వదేశ్‌’ అనే బాలీవుడ్‌ సినిమా తరహాలో దేశభక్తి చిత్రంగా ఉండబోతోందనే వార్త కూడా బాగా వినిపిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా, అల్లరి నరేష్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయనున్నారు.
నా బాధ్యతలను ఎప్పటికీ మర్చిపోను !
సెలబ్రిటీలపై చాలా బాధ్యత ఉంటుందని, వాళ్లు ఎంతోమందికి రోల్‌మోడల్‌గా ఉండాలని అంటున్నాడు టాలీవుడ్ యాక్టర్ మహేశ్‌బాబు. సమాజంలో సెలబ్రిటీలను ఎంతోమంది అభిమానులు, ప్రజలు ఫాలో అవుతారనే విషయం తెలిసిందే.
 
ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేశాడు మహేశ్… “వ్యక్తిగా మంచి పనులు చేస్తే నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఫీలవుతారు. మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే ఓ సెలబ్రిటీగా ఉన్నపుడు ప్రజలకు మంచి సందేశం ఇవ్వడమనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది ఫాలోవర్లు ఉండే సెలబ్రిటీలు..వారిని అభిమానించే వారికి, ప్రజలకు రోల్‌మోడల్‌గా ఉండటం పెద్ద బాధ్యత. అభిమానుల ఆదరణ, ప్రేమతో ఈ స్థాయికి చేరాను. నా బాధ్యతలను ఎప్పటికీ మర్చిపోను” …అంటూ చిట్‌చాట్‌లో చెప్పాడు మహేష్‌.