‘ది విజన్‌ ఆఫ్‌ భరత్‌’ కు19 గంటల్లోనే 10 మిలియన్‌ వ్యూస్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ‘ది విజన్‌ ఆఫ్‌ భరత్‌’ పేరుతో మంగళవారం ‘భరత్‌ అనే నేను’ టీజర్‌ విడుదలైంది. విడుదలైన 19 గంటల్లోనే 10 మిలియన్‌ వ్యూస్‌ను క్రాస్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ టీజర్‌లో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌కి వస్తున్న ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో మహేష్‌ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్‌ 20న విడుదలవుతున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.