ఏ సినిమాకు రాని భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్

‘భరత్ అనే నేను’ … మహేష్ బాబు హీరోగా కొరటాలశివ దర్శకత్వంలో వస్తున్న కొత్తసినిమా . ఒకవైపు మహేష్ అభిమానులు ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఆతృతగా ఉండగా..మరోవైపు సినిమా మాకంటే మాకే కావాలంటూ శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానళ్ళు పోటీపడుతున్నాయి. ఇందుకోసం సినిమా నిర్మాత డి వీ వీ దానయ్యను సంప్రదించగా..ఆయన ఒక్కో భాషలో.. విడివిడిగా 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలనుండి సమాచారం. అయితే సినిమా కోసం ఇంత చెల్లించేందుకు కూడా టీవీ చానెళ్లు సిద్దపడుతున్నాయని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం పూర్తయిపోతుందట. మునుపెన్నడూ ఏ సినిమాకు కూడా ఇంత భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. ఒకవేళ 20 నుండి 25 కోట్ల డీల్ గనుక జరిగితే ఇప్పటివరకు ఇదే తెలుగు సినిమాల్లోకెల్లా అతిపెద్ద డీల్ కానుంది.ప్రస్తుతం మహేష్, బాలీవుడ్ భామ కైరా అద్వానీ  పై హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2018 జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.