మహేష్ బాబు, పూజాహెగ్డే చిత్రం ఏప్రిల్ 5న ?

‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘సూపర్‌స్టార్’ మహేశ్‌బాబు ఈమధ్య తన సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వడం లేదు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా చకచకా షూటింగ్‌లను పూర్తిచేస్తున్నాడు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేశ్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని కష్టపడుతున్నాడు. ఇటీవల డెహ్రాడూన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో పూజహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

తాజాగా ఫిల్మ్‌మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. అసలైతే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను సిద్ధం చేయాలని అనుకున్నారు. అయితే షెడ్యూళ్లలో తేడా రావడంతో పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతాయని భావించి సినిమా విడుదలను వేసవికి వాయిదా వేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుంది కాబట్టి, కొంచెం సమయాన్ని తీసుకొని ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహేశ్‌కు ‘భరత్ అనే నేను’ ద్వారా మంచి హిట్టు దొరికింది. అదే తరహాలో తన 25వ సినిమాను కూడా నెక్స్ ఏప్రిల్‌లోనే విడుదల చేసి హిట్టు కొట్టాలని ఆశిస్తున్నారు.

మహేష్ స్పెషల్‌ సాంగ్స్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌

మహేశ్‌బాబు సినిమాల్లో ఉన్న స్పెషల్‌ సాంగ్స్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌ . ‘పోకిరి’ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు…’, ‘దూకుడు’ సినిమాలో ‘ఆటో అప్పారావు…’, ‘వన్‌: నేనొక్కడినే’ చిత్రంలో ‘లండన్‌ బాబులు’, ‘ఆగడు’లో ‘జంక్షన్‌లో..’ పాటలే అందుకు ఉదాహరణ. తాజాగా మహేశ్‌ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట చిత్రబృందం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.‘అల్లరి’ నరేశ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా సెకండాఫ్‌లోనే ఐటమ్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట చిత్రబృందం. ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్‌ ఐటమ్‌సాంగ్‌ ట్రాక్‌ను ఫైనలైజ్‌ చేశారని టాక్‌.ఇందుకోసం టాప్‌ కథానాయికల లిస్ట్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి.. ఈ స్పెషల్‌ సాంగ్‌ చేయబోయే స్పెషల్‌ గాళ్‌ ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం కాస్త టైమ్‌ పడుతుంది. అంతేకాక ‘ఆగడు’ సినిమా తర్వాత మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్‌ అనే నేను’ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ లేవు. మళ్లీ ఇప్పుడు ఆల్మోస్ట్‌ నాలుగేళ్ల తర్వాత స్పెషల్‌ సాంగ్‌ అనగానే అది ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో మొదలైంది.