మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుక

మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించిన కొత్త ఫోటోను దసరా శుభాకాంక్షలతో విడుదల చేశారు. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీ లోని కొండారెడ్డి బురుజు సెట్ లో జరుగుతోంది.
తమిళనాడు, కేరళలో జరిగే షెడ్యూల్‌తో నవంబర్‌ నెలాఖరుకు షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు , రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి, ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం