మహేష్ సర్కార్ వారి సినిమాల తాజా సమాచార్ !

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో వారు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదే విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఆర్ఆర్ఆర్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్టు తాజా సమాచారం. టాలీవుడ్‌లో లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ చిన్న సినిమాల నుంచి రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ వరకు దాదాపు అన్ని సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దాదాపు టాలీవుడ్ సినిమాలన్ని రిలీజ్ డేట్‌లను ప్రకటించారు. ఈ క్రమంలో రాం చరణ్,ఎన్.టి.ఆర్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న ప్రపనంచ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఆర్ఆర్ఆర్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా.. సాంగ్ ఒకటి త్వరలో  రాం చరణ్,ఆలియా భట్ మీద చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది. దాంతో మార్చ్‌లో కంప్లీట్ అవ్వాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మరో నెలరోజులు పొడిగించబోతున్నట్టు సమాచారం.

రాం చరణ్ ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటుండగా, తారక్ ‘మీలోఎవరు కోటీశ్వరులు’ అన్న రియాలిటీ షో చేస్తూ ఉండటమే అందుకు కారణం అని అంటున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ వీఎఫెక్స్ వర్క్ కి చాలా సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవనున్నట్టు చెప్పుకుంటున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న పరశురాం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నెలరోజుల షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తి కాగా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా దుబాయ్‌లోనే పాన్ చేసినట్టు సమాచారం. ‘సర్కారు వారి పాట’ ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక మోసాల నేపథ్యంగా ఈసినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురాం. అయితే ఈ ఏడాది పెద్ద సినిమాలన్ని రిలీజ్ డేట్ లాక్ చేసుకొని ఉండటంతో ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదే విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

రెండు,మూడేళ్ళు లాకవ్వాల్సిందే!…
‘సర్కారు వారి పాట’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌లో డా.కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం   తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి కొత్త ప్రాజెక్ట్‌ని వెంటనే మొదలవుతుందని భావించారు. కాని రాజమౌళి పూర్తి స్థాయి కథ సిద్దం చేసి మహేష్‌కి  వినిపించడానికే చాలా సమయం పడుతుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’  రిలీజ్ తర్వాత కనీసం రెండు మూడు నెలలైనా రెస్ట్ తీసుకుంటాడని సమాచారం. ఈరకంగా చూస్తే రాజమౌళి, మహేష్‌ల కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యేది వచ్చే ఏడాదే అని తెలుస్తోంది. అంతేకాదు రాజమౌళితో సినిమా అంటే హీరో ఖచ్చితంగా రెండు నుంచి మూడేళ్ళు లాకవ్వాల్సిందే. మరి మహేష్.. రాజమౌళి దగ్గర మూడేళ్ళు లాకవగలడానికి సిద్ధంగా ఉన్నాడా? అన్నది పలువురి సందేహం.