మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ‘ఆదిపర్వం’ సాంగ్ లాంఛ్

మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం”. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మోగోటి. “ఆదిపర్వం” సినిమా త్వరలో  థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో  నిర్వహించారు.

శివ కంఠమనేని మాట్లాడుతూ – “ఆదిపర్వం” సినిమాలో నేను క్షేత్రపాలకుడి పాత్రలో నటించాను. ఈ పాత్రలో నా మేకోవర్ కొత్తగా ఉంటుంది. రెండు మూడు గంటలు పట్టేది పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు. ఆ క్యారెక్టర్ నేనే చేశానని చెబితే గానీ గుర్తుపట్టరు. అలా కొత్తగా తెరపై కనిపిస్తుంది. మంచు లక్ష్మి గారితో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆమె ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.. అన్నారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ – “ఆదిపర్వం” సినిమాకు తన పూర్తి సపోర్ట్ అందించిన రావుల వెంకటేశ్వర రావు గారికి, ఇతర సహ నిర్మాతలకు, ఘంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్. మా ప్రాజెక్ట్ లోకి మంచు లక్ష్మి గారు రావడంతో ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోయింది. సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఆమె నాగులాపురం నాగమ్మ క్యారెక్టర్ లో “ఆదిపర్వం”లో నటించారు. ఈ సినిమా కోసం ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి. 50 ఫీట్స్ నుంచి దూకే స్టంట్స్ మంచు లక్ష్మి చేశారు. ఆమె డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్ హరీశ్ ఎంతో కష్టపడ్డారు.”ఆదిపర్వం” లాంటి మంచి సినిమాను మీడియా వాళ్లంతా ప్రేక్షకుల దగ్గరకు చేరుస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ – “ఆదిపర్వం” లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా సీజీ వర్క్ తో సహా కంప్లీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఈ సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్ గారు. నేను లాస్ట్ ఇయర్ మొత్తం గాలిలోనే రోప్స్ పై స్టంట్స్ చేస్తూ ఉన్నాను. అంత యాక్షన్ చేయించారు ఈ సినిమాకు. మూడు లొకేషన్స్ లో వర్క్ చేశాను. “ఆదిపర్వం” టీమ్ అందరికీ థ్యాంక్స్. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. ఔట్ ఆఫ్ ది వరల్డ్ క్యారెక్టర్స్ కథలు అంటే నా దగ్గరకే వస్తున్నారు. రీసెంట్ గా యక్షిణి వెబ్ సిరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు “ఆదిపర్వం” చేశాను. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్ అవుతున్నారు. “ఆదిపర్వం” మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను.. అన్నారు.

నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, చీరాల రాజేష్,  చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు….

టెక్నికల్ టీమ్: సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్, ఆర్ట్ : కేవీ రమణ, మ్యూజిక్: మాధవ్ సైబా, సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్, సాహిత్యం: సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, ఊటుకూరు రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా,  ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి, ఫైట్స్: నటరాజ్, కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్టర్, పబ్లిసిటీ డిజైనర్: రమణ బ్రష్, పి.ఆర్.ఓ: మూర్తి మల్లాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి – ప్రదీప్ కాటుకూటి- రవి దశిక – రవి మొదలవలస – శ్రీరామ్ వేగరాజు, నిర్మాత: ఎమ్.ఎస్.కె. రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.