`అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే` మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌

అరిగెల ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై మనీంద‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తూ హీరోగా న‌టిస్తున్న చిత్రం `అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే`. షాను హీరోయిన్‌గా న‌టిస్తుంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, రమేష్ నిర్మాతలు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా.. హీరో, ద‌ర్శ‌కుడు మ‌నీంద‌ర్ మాట్లాడుతూ .. స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటారు. అందుకు ఉదాహ‌ర‌ణ రీసెంట్‌గా విడుద‌లైన ‘ఫిదా’ సినిమా. అలాంటి స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌తో మా చిత్రం `అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే` తెర‌కెక్కుతోంది. అంద‌రి హృద‌యాల‌ను ట‌చ్ చేసే స‌న్నివేశాల‌తో సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా 50 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నిర్మాత‌లు మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కాకుండా స‌హ‌కారం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: సతీష్ బండూరి, సినిమాటోగ్రఫీ: నాగిరెడ్డి