టాప్ హీరోతో మరో భారీ మల్టీస్టారర్‌

మణిరత్నం… బాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్‌ చిత్రాల జోరు ఊపందుకుంది. తెలుగులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఎన్టీఆర్‌’, బాలీవుడ్‌లో ‘కళంక్‌’, ‘బ్రహాస్త్ర’ వంటి మల్టీస్టారర్‌ చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా దక్షిణాదిలో మరో భారీ మల్టీస్టారర్‌ చిత్రానికి మణిరత్నం ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల ఆయన ‘నవాబ్‌’ పేరుతో, ప్రముఖ నటీ నటులతో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కించి విజయాన్ని అందుకున్న విషయం విదితమే.

మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌ను విజయ్, విక్రమ్‌, శింబు వంటి స్టార్స్‌తో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం వారితో కథా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు విజయ్ తో  ఓ భారీ చిత్రానికి కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు ..ఇటీవల మణిరత్నం చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా ఎంపికైంది. ఇక విక్రమ్‌ ‘ధృవ నచ్చథిరమ్‌’, ‘కడరమ్‌ కొండన్‌’ చిత్రాలతో బిజీగా ఉండగా, శింబు ‘వంథా రాజావథాన్‌ వరువెన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.