మార్షల్‌ ఆర్ట్స్‌ లెజెండ్‌ బ్రూస్‌లీ జీవిత చిత్రం !

మార్షల్‌ ఆర్ట్స్‌ లెజెండ్‌, నటుడు, ఫిలాసఫిస్ట్‌ బ్రూస్‌లీ జీవితం ఆధారంగా శేఖర్‌ కపూర్‌ ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పలు అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంగీతం అందించి ఆస్కార్‌ అవార్డులను సైతం అందుకున్న ఎ.ఆర్‌.రెహ్మాన్‌ తాజాగా ఈ అంతర్జాతీయ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.ఇక ఈసినిమాలో శేఖర్ కపూర్ కుమార్తె కావేరి ఓ పాటను పాడనుండటం విశేషం.

బ్రూస్‌లీ జీవితం గురించి, ఆయన ఐకానిక్‌గా ఎదిగిన తీరు, దానికి దోహదపడిన అంశాలతోపాటు హాంకాంగ్‌లో 1950నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కూడా ఈ చిత్రంలో చర్చించబోతున్నారు.
‘లిటిల్‌ డ్రాగన్‌’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు రెహ్మాన్‌ ప్రస్తుతం హిందీలో ’99సాంగ్స్‌’, ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’, తమిళంలో ‘2.0’, ‘సర్వమ్‌ థాల మాయమ్‌’, ‘మెర్సల్‌’, ‘సంఘమిత్ర’ ఇంగ్లీష్‌లో ‘వైశ్రాయ్ హౌస్‌’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.