‘సోషల్ సినిమా’ పత్రిక‌ను ప్రారంభించిన మారుతి

‘సినిమా విషయాలకు, విశేషాలకు ప్రాధాన్యత పెరిగిన సమ‌యంలో ‘సోషల్ సినిమా ’అనే పత్రిక రావడం అభినందనీయమని దర్శకుడు మారుతి తెలిపారు. నిర్వహణ భారం పెరిగిన ఈ పరిస్థితుల్లో కొత్త పత్రిక తేవడం కష్టమైనప్పటికీ.. పత్రికను ప్రారంభించిన నిర్వాహకులను ఈ సంద‌ర్భంగా అభినందించారు మారుతి. డి.వి.పబ్లికేషన్స్‌పై `సోషల్ సినిమా` అనే పత్రికను శనివారం హైదరాబాద్‌లో మారుతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామ‌కృష్ణాగౌడ్, తుమ్మలపల్లి రామ‌సత్యనారాయణ, శోభారాణి, ఆర్.పి.పట్నాయక్, బిజెపి నాయకుడు ప్రశాంత్ కుమార్, డార్లింగ్ స్వామి తదితరులు  పాల్గొన్నారు. సినిమా పత్రిక పరిశ్రమకు, ప్రజలకు మధ్య వారధిగా నిలబడాలని అతిథులు తెలిపారు. ‘పత్రికను అత్యంత బాధ్యతాయుతంగా, పరిశ్రమ వర్గాలకు ఉపయోగకరంగా ఉండేలా చూస్తాన’ని పత్రిక ఎడిటర్ డి.వెంకటేశ్ తెలిపారు.