‘మీకు మాత్రమే చెప్తా’ మ్యూజిక్ వీడియో విడుదల

‘కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్’ పతాకంపై విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ రూపొందిన సినిమా “మీకు మాత్రమే చెప్తా”. మ్యూజిక్ వీడియో “నువ్వే హీరో” సాంగ్ లాంచ్ విజయ్ ఫాన్స్ చేతుల మీదుగా విడుదలైన జరిగింది. ఎ ఎమ్ బి మాల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో రెండు వందల మంది విజయ్ దేవరకొండ ఫాన్స్ ప్రత్యేక అతిధులు గా పాల్గొన్నారు.మ్యూజిక్ వీడియో లాంచ్ లో ‘నవాబ్ రాప్ గ్యాంగ్’ పాడిన పాట హైలెట్ గా మారింది. వారితో కలిసి విజయ్ స్టెప్స్ వేశారు.
 
విజయదేవరకొండ మాట్లాడుతూ …
ఈ సాంగ్ కోసం నేను చాలా కష్ట పడ్డాను.మా కొరియోగ్రాఫర్ విజయ్ నాకంటే ఎక్కువ శ్రమ తీసుకున్నాడు. తరుణ్, అభినవ్ గోమటం కూడా నాతో స్టెప్స్ వేయాలి కానీ, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తో కుదరలేదు. కొత్త వారు అయినా మా ప్రయత్నానికి ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు అందించిన సహకారం మర్చిపోలేను. శివ మంచి మ్యూజిక్ అందించాడు. తరుణ్ యాక్టింగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అభినవ్ బాగా ఎంటర్టైన్ చేసాడు. నవంబర్ 1 న విడుదల అవుతుంది ” అన్నారు.
 
‘ఆదిత్య మ్యూజిక్’ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ…
‘ గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ ఆడియో ఆదిత్య ద్వారా రిలీజ్ చేసాము. ‘మీకు మాత్రమే చెప్తా’ ఆడియో ని మాపై నమ్మకం తో ఇచ్చిన ప్రొడ్యూసర్ వర్ధన్ దేవరకొండ గారికి థాంక్స్అన్నారు.
 
దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ…
“ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. తరుణ్ బాగా యాక్ట్ చేసాడు, మంచి ఎంటర్టైనర్ తో నవంబర్ 1న మీ ముందుకు వస్తున్నాం.తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు” అన్నారు.
తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్ తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ నటిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్,ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ,నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ,రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.